Ajith Kumar: హీరో అజిత్ ఇంట్లో విషాదం.. తల్లి కన్నుమూత

తమిళ చిత్రపరిశ్రమలోని టాప్ హీరోలలో అజిత్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అజిత్.. ఇప్పుడు అటు సినిమాలు.. ఇటు కార్ రేసింగ్ తో బిజీగా ఉన్నారు

Ajith Kumar: హీరో అజిత్ ఇంట్లో విషాదం.. తల్లి కన్నుమూత
Ajith

Updated on: May 30, 2026 | 10:51 AM

తమిళ్ స్టార్ హీరో అజిత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మోహిని శనివారం ( మే30న )కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మోహిని.. చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు అజిత్.

అజిత్ తల్లి మరణవార్త విని అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అజిత్ సికింద్రాబాద్ లోజన్మించారు. తనకి చిన్నప్పుడూ తమిళ్ రాదు అయిన్నప్పటీకి సినిమా హిరోగా తమిళ హిరోగా తమిళ్ లో మంచి పేరు తెచ్చుకునాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us