
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే హైప్ నెలకొంది. పవర్ ఫుల్ మాస్ కథను బాలయ్య కోసం సిద్దం చేశారట కొరటాల శివ. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ కాకుండా.. హోమ్లీ, పద్దతైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలో మాత్రం ఈ అమ్మడు పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే.. బాలయ్యకు ధీటుగా లేడీ విలన్ గా ఐశ్వర్యను చూడబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
ఐశ్వర్య రాజేష్.. సౌత్ ఇండస్ట్రీలో సహజమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా తమిళంలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూల్లు చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అటు వెండితెరపై, ఇటు ఓటీటీలో తనదైన నటనతో అలరిస్తుంది. ఇటీవలే ఇసకపట్నం సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియులను అలరించింది. ఇప్పటివరకు కథానాయికగా రాణించిన ఈ అమ్మడు.. విలన్ పాత్రలో బాలయ్యకు ధీటుగా ఎలా నటిస్తుందో చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..