Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ టాలెంటెడ్ హీరోయిన్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాలు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో అద్భుతమైన ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ టాలెంటెడ్ హీరోయిన్...
Pawan Kalyan

Edited By:

Updated on: Sep 19, 2021 | 7:25 PM

Aishwarya Rajesh: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగమ్మాయి అయినా.. తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు దక్కించుకుంటుంది. ఆ మధ్య విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో నటించింది ఐశ్వర్య. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచినా… ఐశ్వర్య నటనకు మంచి పేరొచ్చింది. ఇక రీసెంట్‌గా టక్ జగదీష్ సినిమాలో నటించింది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకుంది తెలుస్తుంది. ఛాన్స్ అంటే అలాంటి ఇలాంటి ఛాన్స్ కాదు ఏకంగా పవర్ స్టార్ సినిమాలో నటించే అవకాశం వస్తే సింపుల్‌గా వదిలేసిందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాలు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమానుంచి ఐశ్వర్య తప్పుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య స్థానంలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీలో హీరోయిన్‌గా నటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..