Telugu Indian Idol Season 2 : మరోసారి అలరించడానికి రెడీ అయిన తెలుగు ఇండియన్ ఐడల్.. త్వరలోనే సీజన్2 ఆడిషన్స్..

తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ను కూడా మంచి ప్రేక్షకాదరణతో పూర్తి చేసిన ఆహా ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అయ్యింది.

Telugu Indian Idol Season 2 : మరోసారి అలరించడానికి రెడీ అయిన తెలుగు ఇండియన్ ఐడల్.. త్వరలోనే సీజన్2 ఆడిషన్స్..
Aha

Updated on: Jan 17, 2023 | 2:54 PM

100శాతం తెలుగు కంటెంట్ తో  ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఆహా.. గేమ్ షోస్ తో పాటు.. టాక్ షోలతోనూ అలరిస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ వస్తోన్న ఆహా. నటసింహం నందమూరి బాలకృష్ణతో అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో ఇప్పటికే దేశంలో నెంబర్ వన్ టాక్ షో గా నిలిచింది. మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సెకండ్ సీజన్ లోనూ రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ను కూడా మంచి ప్రేక్షకాదరణతో పూర్తి చేసిన ఆహా ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అయ్యింది. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 మొదలు కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆహా.

ప్రస్తుతం ఈ సీజన్ 2 కు సంబందించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. గత సీజన్ కు సింగర్ కార్తీక్ , హీరోయిన్ నిత్యామీనన్, మ్యూజిక్ సెన్సషన్ తమన్ జడ్జ్ లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్స్ జరుగుతున్న విషయానికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ వీడియాలో గత సీజన్ లో కంటెస్ట్  చేసిన సింగర్ బాలకృష్ణ సాంగ్స్ పడుతూ సందడి చేశారు. అలాగే సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఆడియోషన్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. మరి ఈ సీజన్ ప్రేక్షకులను అలా అలరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి