Wayanad Landslide: గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య ఫ్యామిలీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం

|

Aug 01, 2024 | 4:07 PM

ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మృతులు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ సమస్య ఉన్నా సాయం చేయడంలో ముందుండే సూర్య వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అలాగే మృతుల కుటుంబాలు, బాధితులను ఆదుకునేందుకు కుటుంబంతో కలిసి ముందుకు వచ్చాడు

Wayanad Landslide: గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య ఫ్యామిలీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం
Suriya Family
Follow us on

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి సుమారు రూ. 250కుపైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. అలాగే మరెంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆచూకీ లేకుండా పోయిన వారు కూడా చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మృతులు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ సమస్య ఉన్నా సాయం చేయడంలో ముందుండే సూర్య వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అలాగే మృతుల కుటుంబాలు, బాధితులను ఆదుకునేందుకు కుటుంబంతో కలిసి ముందుకు వచ్చాడు. వయనాడ్ బాధితుల సహాయార్థం సూర్య, జ్యోతిక, కార్తి కలిసి రూ.50 లక్షలను కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ‘ఇది హృదయ విదారక ఘటన. రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా సాయం చేస్తోన్న వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు సూర్య.

అంతకన్నా ముందు మరో ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ కూడా మంచి మనసు చాటుకున్నాడు. వయనాడ్‌ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విచారంలో మునిగిపోయింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు మూవీ యూనిట్లు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

హీరో సూర్య ట్వీట్..

మరోవైపు వరదలు, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వయనాడ్ లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రూ. 20 లక్షలు విరాళం అందజేసిన నటుడు విక్రమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.