Major Movie: అడవి శేష్ ‘మేజర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

|

Jan 29, 2021 | 1:27 PM

26/11 ముంబై ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం మేజర్. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా...

Major Movie: అడవి శేష్ ‘మేజర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
Follow us on

Adivi Sesh – Major Movie: 26/11 ముంబై ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం మేజర్. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్‌ను ప్రకటించారు మూవీ మేకర్స్. శుక్రవారం ఉదయం సూపర్ స్టార్ మహేష్ బాబు, అడవి శేష్ మేజర్ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మహేష్ బాబు, అడవి శేష్ ట్విట్ చేశారు.

ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల అడవి శేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మేజర్ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మూవీ మేకర్స్.. తాజాగా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.

Also Read:

‘హిట్’ సినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న నాని .. విష్వక్ సేన్ ప్లేస్ లో ఆ హీరో  

Mohan Babu: సీరియస్ లుక్‌లో మోహన్ బాబు.. ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్‌లుక్ రిలీజ్