Adivi Sesh: అడవి శేష్‏కు అల్లరి నరేష్ అన్నయ్య అవుతాడా ..? అసలు విషయం చెప్పిన హీరో..

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన సినిమా ఈరోజు మే 3న థియేటర్లలో విడుదలైంది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. ఇందులో వైవా హర్ష, వెన్నెల కిషోర్ తోపాటు మిగతా నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ప్రమోషన్లతో ఆసక్తిని కలిగించారు మేకర్స్.

Adivi Sesh: అడవి శేష్‏కు అల్లరి నరేష్ అన్నయ్య అవుతాడా ..? అసలు విషయం చెప్పిన హీరో..
Allari Naresh, Adivi Sesh

Updated on: May 03, 2024 | 8:57 AM

తెలుగు ప్రేక్షకులకు అల్లరి నరేష్ సుపరిచితమే. కామెడీ కంటెంట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం వినోదాత్మక చిత్రాలే కాకుండే వైవిధ్యమైన సినిమాలతో మెప్పించాడు. ఉగ్రం, నాంది సినిమాతో హీరోగా మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆ ఒక్కటీ అడక్కు అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించిన సినిమా ఈరోజు మే 3న థియేటర్లలో విడుదలైంది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. ఇందులో వైవా హర్ష, వెన్నెల కిషోర్ తోపాటు మిగతా నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ప్రమోషన్లతో ఆసక్తిని కలిగించారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు యంగ్ హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ తనకు అన్నయ్య అనే విషయాన్ని బయటపెట్టాడు. “ఇండస్ట్రీలో నరేష్ అన్నయ్య రాజేష్ నాకు మంచి స్నేహితుడు. మా అన్న సాయి కిరణ్ కు నరేష్ తెలుసు. నా ఫస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నరేష్ అతిథిగా వచ్చారు. మా కుటుంబంలో నరేష్ ను పెద్ద అన్నయ్యలా ట్రీట్ చేస్తాం. ఆయనెప్పుడూ సంతోషంగా ఉంటాలని కోరుకుంటాం. ఈ మూవీ యూనిట్ లోని చాలా మంది నా కెరీర్ మొదట్లో సపోర్ట చేశారు. అందుకే ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.అలా తాను నరేష్ ను అన్నయ్యలా భావిస్తానని తెలిపారు అడివి శేష్.

ఆ ఒక్కటీ అడక్కు.. ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యను ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరెకక్కించాడు డైరెక్టర్ మల్లి అంకం. మే 3న విడుదల ఈ సినిమాకు ఉదంయ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.