నటి శ్వేతా అగర్వాల్‌ను మనువాడనున్న ఆదిత్య నారాయణ్‌

|

Oct 12, 2020 | 11:01 PM

ప్రముఖ సింగర్ ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి శ్వేతా అగర్వాల్‌తో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు.

నటి శ్వేతా అగర్వాల్‌ను మనువాడనున్న ఆదిత్య నారాయణ్‌
Follow us on

ప్రముఖ సింగర్ ఉదిత్‌ నారాయణ్‌ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు, నటి శ్వేతా అగర్వాల్‌తో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య నారాయణ్‌ కన్ఫామ్ చేశాడు. పదేళ్ల తమ ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలు ఎక్కించేందుకు అంతా సిద్దమైనట్లు వెల్లడించాడు. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో తమ పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పాడు. కాగా బాలీవుడ్‌ నటుడిగా, టీవీ షోల వ్యాఖ్యతగా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్‌, శ్వేతతో కలిసి ‘షాపిత్‌’ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.

అదంతా స్క్రిప్ట్ :

ఇక ఇండియన్‌ ఐడల్‌ షో స్క్రిప్టులో భాగంగానే గాయని‌ నేహా కక్కర్‌తో తన పెళ్లి అంటూ ఓ ఎపిసోడ్‌ను షూట్ చేశారని, తమ మధ్య ఫ్రెండ్షిప్ తప్ప మరేమీ లేదని ఆదిత్య తెలిపాడు. ఇక సోషల్‌ మీడియా వేదికగా తాను నటుడు రోహన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రేమలో ఉన్నట్లు నేహా కూడా తెలిపిన విషయం తెలిసిందే.  వాళ్లిద్దరూ తనకు మంచి స్నేహితులని, త్వరలోనే వారి పెళ్లి కూడా జరగబోతుందని ఆదిత్య నారాయణ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ( పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )