మై బాడీ, మై ఛాయిస్..! నచ్చిన బట్టలు వేసుకుంటా.. యంగ్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తమ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు తమ గ్లామరస్ ఫొటోలతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు .

మై బాడీ, మై ఛాయిస్..! నచ్చిన బట్టలు వేసుకుంటా.. యంగ్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్
Actress

Updated on: Mar 15, 2026 | 7:27 PM

హీరోయిన్స్ డ్రసింగ్ పై ఇప్పటికే ఎన్నో రకాల వాదనలు, వివాదాలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతోమంది హీరోయిన్స్ గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. కొందరు పద్దతిగా చీరకట్టుకొని ఫోటోలు షేర్ చేస్తుంటారు. అలాగే మోడ్రన్ డ్రస్సుల్లోనూ మెప్పిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ తన డ్రసింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు అదితి మ్యాకల్. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. అలాగే హీరోయిన్ గాను సినిమాలు చేసి ఆకట్టుకుందిఈ ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్‌ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు  చేసిన ఈ భామ .. పలు ఫ్యాషన్ షోలోనూ పాల్గొంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా కనిపించింది ఈ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి మ్యాకల్ తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి.. అలాగే తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంది.  ముంబై నటీమణులు బోల్డ్ సన్నివేశాలు లేదా దుస్తులు ధరించినప్పుడు ప్రేక్షకులకు అంగీకారం ఉంటుందని, అదే ఒక తెలుగు అమ్మాయి చేస్తే జడ్జిమెంట్‌లు ఎదురవుతాయని చెప్పుకొచ్చింది.  అమీతుమీ చిత్రం విడుదలైన వెంటనే తాను చేసిన బోల్డ్ ఫోటోషూట్‌లు అవకాశాల కోసం కాదని తెలిపింది. కేవలం బబ్లీ గర్ల్ పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నానని తెలిపింది. బోల్డ్ ఫోటోషూట్‌లు ఒక పోర్ట్‌ఫోలియోలా పనిచేస్తాయని, పాత్రకు అవసరమైతే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

తాను కూడా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరు తనను లైంగికంగా వేధించిన సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ సమయంలో కోయాక్టర్లు ఉన్నప్పటికీ తాను మాట్లాడలేకపోయానని, అది తనను బాధిస్తుందని.. నన్ను వేధించిన వ్యక్తి నవ్వుతూ వెళ్లిపోవడం చూసి బాధపడ్డానని తెలిపింది. క్లాసికల్ డ్యాన్స్ రీల్స్‌కు తక్కువ రీచ్ ఉంటుందని, కానీ బోల్డ్ ఫోటోషూట్‌లకు ఎక్కువ రీచ్ ఉంటుందని అదితి మ్యాకల్ తెలిపింది. ఇది తనకు బాధ కలిగిస్తుందని, ప్రజలు తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని.. దుస్తులు కాదు, మైండ్‌సెట్ ముఖ్యమని తెలిపింది. తాను పూర్తిగా బాడీ కవర్ అయ్యేలా దుస్తులు వేసుకున్నప్పటికీ తనకు వేధింపులు ఎదురయ్యాయని కరెక్ట్ గా ఉన్నప్పుడు అవకాశాలు రానప్పుడు, తాను కోరుకున్న దుస్తులు వేసుకుంటానని.. ఇట్స్ మై బాడీ, మై ఛాయిస్ అని తెలిపింది. అలాగే తాను ఏ సన్నివేశం పడితే అది చేయనని, సినిమాకు అవసరమైతేనే చేస్తానని చెప్పుకొచ్చింది అదితి మ్యాకల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us