Tollywood: ‘వస్తావా? గంటకు రేటెంత? అని అడుగుతున్నారు? స్టార్ హీరోయిన్ ఆవేదన

సినిమా తారలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంత మంది అదే పనిగా హీరోలు/ హీరోయిన్లు టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తుంటారు. అసభ్యకర సందేశాలు పంపుతుంటారు. ఇప్పుడు తనకు ఇదే పరిస్థితి ఎదురైందంటూ ఆవేదన వ్యక్తం చేసిందీ అందాల తార.

Tollywood: వస్తావా? గంటకు రేటెంత? అని అడుగుతున్నారు? స్టార్ హీరోయిన్ ఆవేదన
Girija Oak

Updated on: Nov 26, 2025 | 9:46 PM

సినిమా తారలది లగ్జరీ లైఫ్ అనుకుంటారు చాలా మంది. విశాలమైన భవనాల్లో ఉంటారు.. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు.. విందులు, వినోదాల్లు మునిగితేలుతుంటారు. వీరికేం కష్టాలు ఉంటాయి? అని భావిస్తుంటారు. అయితే సినిమా సెలబ్రిటీలకు కూడా చాలా ఇబ్బందులుంటాయి. మనలా స్వేచ్ఛగా బయట తిరగలేరు. సినిమాలు, షికార్లకెళ్లలేరు. నిజం చెప్పాలంటే పాపులారిటీ, క్రేజ్ నే సినిమా వాళ్లకు పెద్ద శత్రువు. ఇక సోషల్ మీడియా లో సినిమా తారలకు ఎదరయ్యే వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంత మంది అదే పనిగా హీరోలు/ హీరోయిన్లను విమర్శిస్తుంటారు. అసభ్యకర పదజాలంతో దూషిస్తుంటారు. కొందరు ఈ విషయాలను బయటకు చెప్పుకోరు. మరికొందరు ధైర్యంగా తమ ఆవేదనను పంచుకుంటారు. అలా ఇటీవల బాగా వైరలవుతోన్న ఓ ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.

ప్రముఖ మరాఠి నటి గిరిజా ఓక్ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. నెట్టింట చాలా మంది ఈమె నామస్మరణే చేస్తున్నారు. ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తోన్న ఈ అందాల తార ఒకే ఒక్క ఇంటర్వ్యూ క్లిప్స్‌ వల్ల సడన్‌గా సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయింది. లేటు వయసులో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పుడు ఆమె ఫాలోవర్లు అమాంతం పెరిగారు. క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. అయితే ఇదే తనకు చేటు తెచ్చిందంటోంది గిరిజా ఓక్.

ఇవి కూడా చదవండి

‘ఈ పాపులారిటీ, క్రేజ్ కారణంగా నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే లేదనే చెప్తాను. ఇప్పుడు నాకేమీ సినిమా ఆఫర్లు రావడం లేదు. పైగా నెగెటివ్‌ కామెంట్లు కూడా చాలా వస్తున్నాయి. నా రేటెంత? అని అడుగుతున్నారు. నాతో గంటసేపు గడపాలంటే ఎంత తీసుకుంటావ్‌? అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్‌లకు లెక్కే లేదు. నన్ను దూషించే వాళ్లకు నిజ జీవితంలో నేను తారసపడితే కనీసం కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ చూసినా.. గౌరవంతో మాట్లాడతారే తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరు. కానీ ఈ ఆన్‌లైన్‌ చాటున మాత్రం వీరు నోటికి ఏదొస్తే అది అనేస్తున్నారు’ అని వాపోయింది గిరిజ. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

 గిరిజా ఓక్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

కాగా తారే జమీన్‌ పర్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, సైకిల్‌ కిల్‌, కాలా, జవాన్‌, ద వ్యాక్సిన్‌ వార్‌, ఇన్‌స్పెక్టర్‌ జిండె వంటి హిందీ సినిమాల్లో నటించింది గిరిజా ఓక్. కాగా షోర్‌ ఇన్‌ ద సిటీ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తో ఈ బ్యూటీ చేసిన రొమాన్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.