Yamuna: స్టార్ హీరోలతో సినిమాలు.. 3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని ఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. అప్పట్లో వార్తలలో ఆమె పేరు మారుమోగింది. కొంతకాలానికి ఆమె తప్పు లేదని తెలీంది. కానీ అప్పటికే జరగాల్సిన తప్పిదం జరిగిపోయింది. ఇటీవల తన జీవితంలో ఎదురైన కష్టాలను వెల్లడించింది యమున.

Yamuna: స్టార్ హీరోలతో సినిమాలు.. 3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
Yamuna

Updated on: Aug 12, 2026 | 11:43 AM

ప్రముఖ నటి యమున, తన జీవితంలో ఎదురైన తీవ్రమైన వ్యక్తిగత పోరాటాలు, డిప్రెషన్, ప్రపంచం పట్ల అంతులేని కోపం నుండి విపశ్యన ధ్యానం ద్వారా ఎలా విముక్తి పొంది, అంతర్గత శాంతిని కనుగొన్నారో ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. ఇది కేవలం ఒక ధ్యాన పద్ధతి కాదని, తన జీవితాన్ని సమూలంగా మార్చిన ఒక ఆత్మావిష్కరణ ప్రయాణమని ఆమె వెల్లడించారు. యమున మాట్లాడుతూ, ఒకానొక దశలో “ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు, నా పక్షాన నిలబడలేదు” అనే తీవ్రమైన కోపంతో, బాధతో జీవించానని తెలిపారు. ఈ పెయిన్, ఈ అవమానాలకు ప్రతీకారంగా ఎదగాలనే తపన ఆమెను విపశ్యన వైపు నడిపించింది. తన కుమార్తె సందేహాలను పక్కనపెట్టి, రోజుకు పది గంటల పాటు ధ్యానం చేయాలనే కఠినమైన శిబిరానికి సిద్ధమయ్యారట.

విపశ్యన శిబిరంలో మొదటి రోజుల్లోనే మానసిక మార్పులు ప్రారంభమయ్యాయని యమున వివరించారు. మొదట, ఆహారం విషయంలో స్వార్థం, అహం ప్రదర్శించినా, క్రమంగా క్రమశిక్షణ అలవడిందని, తోటి సాధకులకు సహాయం చేయాలనే తపన పెరిగిందని చెప్పారు. “మనలో ఎన్ని తప్పులున్నాయో, ఎంత స్వార్థంగా ఉంటామో అక్కడకు వెళ్ళాకే తెలుస్తుంది” అని ఆమె అన్నారు. నాలుగో రోజుకు ఆమె తీవ్రమైన భావోద్వేగ ప్రక్షాళనను అనుభవించారు, ఏడుస్తూనే తనలోని కోపానికి, ముఖ్యంగా తన కుమార్తెపై కలిగిన ఆగ్రహానికి క్షమాపణలు చెప్పుకున్నారు. “నేను” అనే అహం క్రమంగా కరిగిపోయి, అది నథింగ్ అని గ్రహించానని తెలిపారు.

ఏడవ రోజున యమున భంగ అనే స్థితిని చేరుకున్నారని, అది శరీరం, మనస్సులకు అతీతమైన అనుభూతి అని పేర్కొన్నారు. ఈ డీప్ మెడిటేషన్ స్థితిలో చిన్ననాటి భయాలు, దెయ్యాలు, భూతాలు వంటి కల్పనలు బయటకు వచ్చాయని, ప్రాణం వదిలేస్తున్నానేమో అనే భయం కూడా కలిగిందని ఆమె వివరించారు. అయితే, గురువుల మార్గదర్శకత్వంలో శ్వాసపై దృష్టి సారించి ఆ భయాలను అధిగమించానని చెప్పారు. అవి తమలోని లోతైన భావోద్వేగాలు బయటకు వెళ్ళిపోతున్నాయని టీచర్లు చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు. పదవ రోజుకు ఆమె మనస్సు పూర్తిగా స్వచ్ఛమై, శరీర రహిత స్థితిని, గాల్లో తేలియాడుతున్న అనుభూతిని పొందానని తెలిపారు. “అవన్నీ నిజాలే. ఏదీ మాయ కాదు. రాగద్వేష మోహాలు తీసేస్తే వచ్చే ఒక అనుభూతి” అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి

విపశ్యన అనంతర జీవితం పూర్తిగా మారిందని యమున స్పష్టం చేశారు. నటన, యూట్యూబ్ వంటి వాటిపై ఆసక్తి తగ్గినా, బాధ్యతగా పనిచేస్తున్నానని, అయితే షూటింగ్ తర్వాత వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతానని చెప్పారు. ప్రతిరోజూ మూడు గంటల పాటు ధ్యానం చేయడం ఆమె దినచర్యలో భాగమైంది. ముఖ్యంగా మిత్త అంటే విశ్వంలోని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే సాధన ఆమెలో ద్వేషాన్ని పూర్తిగా తొలగించిందని చెప్పారు. “మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళ పట్ల కూడా ద్వేషం లేదు, వాళ్ళు ఎదురుగా వచ్చినా బాగుండాలని కోరుకుంటా” అని ఆమె వివరించారు. గతంలో దూరమైన బంధువులు కూడా ఆమెలోని మార్పును చూసి తిరిగి వచ్చారని, ఇది విపశ్యన గొప్పతనమని యమున అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

Loading...
Unable to load recommendations.
Follow Us