
టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న తెలుగమ్మాయిల్లో వైష్ణవి చైతన్య పేరు ముందువరుసలో ఉంటుంది. యూట్యూబ్ వీడియోలతో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఒక్కసారిగా స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అందం, అభినయంతో పాటు సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న వైష్ణవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమె వయసుపై కొంతకాలంగా నెట్టింట్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వైష్ణవి చైతన్య వయసు 32 ఏళ్లు అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణంగా వికీపీడియాలో ఆమె వయసుకు సంబంధించిన వివరాలు కనిపించడం అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమె వయసుపై కూడా నెటిజన్ల మధ్య చర్చ మరింత పెరిగింది.
తన వయసుపై జరుగుతున్న ప్రచారానికి తాజాగా వైష్ణవి చైతన్య స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. వికీపీడియాలో తన వయసుకు సంబంధించిన సమాచారం తప్పుగా ఉందని వెల్లడించింది. వికీపీడియాలో తన వయసు 33 ఏళ్లుగా చూపిస్తున్నారని, అయితే అది నిజం కాదని వైష్ణవి చెప్పింది. తన వయసు 25 సంవత్సరాలు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. తన మాటలకు మరింత బలం చేకూర్చేలా ఆధార్ కార్డును చూపిస్తూ తన వయసుపై వస్తున్న ప్రచారానికి ఆమె క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో ఇప్పటివరకు తన వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య ఇచ్చిన ఈ క్లారిటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో అభిమానులు కూడా వికీపీడియాలో ఉన్న వివరాలను సరిచేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక వైష్ణవి సినిమాల విషయానికొస్తే.. ‘బేబీ’తో వచ్చిన గుర్తింపును కొనసాగిస్తూ వైష్ణవి చైతన్య వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్ గా ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది వైష్ణవి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.