
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది భామలు పెళ్లి అనే ఊసులేకుండా సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి టాపిక్ ఎత్తకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. యంగ్ హీరోయిన్స్ 10, 20 సినిమాల తర్వాత పెళ్లి పీటలెక్కుతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ మాత్రం 40ఏళ్లు దాటుతున్నాకూడా పెళ్లి చేసుకోవడం లేదు . తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా 40 ఏళ్ల వయసులో లవ్ లో పడ్డానని తెలిపింది. దాంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆతర్వాత ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె ఇప్పుడు 40ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాను అని పోస్ట్ చేసిన ఆ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో కాదు ఆమె త్రిష. తెలుగులో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. మొన్నామధ్య పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్రిష ఇటీవల విదాముయార్చి, ఐడెంటిటీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, తగ్ లైఫ్ వంటి సినిమాల్లో నటిస్తోంది.రీసెంట్ గా త్రిష తన వాలెంటైన్ న యూ పరిచయం చేసింది. “ఫిబ్రవరి 2,2025.. నేను ఇజ్జీని దత్తత తీసుకున్న రోజు. ఆమె నన్ను రక్షించింది. ఆమెను నాకు ఇచ్చి నా జీవితంలోకి వెలుగు వచ్చేలా చేసినందుకు లోగేష్ బాలాచంద్రన్‌కు ధన్యవాదాలు. నా కోసం దేవుడు పంపిన చిన్నారి. ఎప్పటికీ నువ్వే నా వాలెంటైన్’’ అని త్రిష పోస్ట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి