Surekha vani: నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న సురేఖ వాణి

ఇటీవల సురేఖ వాణి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా తల్లిలానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తుంది. ఇటీవలే సుప్రిత హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. ఇక సురేఖ వాణి భర్త చనిపోయిన విషయం తెలిసిందే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ..

Surekha vani: నా గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న సురేఖ వాణి
Surekha Vani

Updated on: Mar 13, 2024 | 4:50 PM

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖ వాణి ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు సురేఖ వాణి.. అంతే కాదు ఆమె కామెడీ టైమింగ్ తోనూ ప్రేక్షకులను అలరించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి.. ఇప్పుడు సినిమాలు తగ్గించారు. ఇటీవల సురేఖ వాణి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా తల్లిలానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చూస్తుంది. ఇటీవలే సుప్రిత హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది. ఇక సురేఖ వాణి భర్త చనిపోయిన విషయం తెలిసిందే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ.. తన పై వచ్చిన ట్రోల్స్ గురించి.. తాను ఎదుర్కున్న సమస్యల గురించి ఎమోషనల్ అయ్యారు.

నా భర్త చనిపోయినప్పుడు చాలా ఏడ్చా.. విలవిలలాడిపోయా.. నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడే డైరెక్టర్‌ సురేశ్‌ తేజతో పెళ్లి జరిగింది. ఇప్పుడు నా వయసు 40 దాటింది. కానీ నా పై రకరకాల కామెంట్స్ చేశారు, ట్రోల్ చేశారు. భర్త చనిపోయిన తర్వాత విచ్చల విడిగా తిరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ వయసులోనూ 20 ఏళ్ల పిల్లలా ఎంజాయ్ చేస్తుంది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు.. మొదట్లో నేను ఆ కామెంట్స్ ను భరించలేకపోయాను అన్నారు సురేఖ.

ఆతర్వాత వాటిని పట్టించుకోవడం మానేశా.. అందరి నోర్లు మూయించలేం కదా.. న భర్త ఉన్నా కూడా ఇలానే ఉంటా.. సింగిల్ పేరెంట్ ను కదా ఈ విమర్శలు, అవమానాలు ఉంటూనే ఉంటాయి. కొంతమంది నా గురించి వీడియోలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారు అని తెలిపింది సురేఖ. నా భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను అతన్ని సరిగ్గా చేసుకోలేదని నా భర్త కుటుంబసభ్యులు అనుకుంటున్నారు. నా భర్తకు డయాబెటిస్‌ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్ గా ఆయన గుండె ఆగిపోయింది. ఇక నాకు ఎవరితోనే ఎఫైర్ ఉందని.. అందుకే రిచ్ గా బతికేస్తున్నా అని అనుకుంటున్నారు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. నన్ను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారు. నాకు ప్రశాంతమైన జీవితం అవ్వమని తిరుపతిలో మొక్కుకొని గుండు చేయించుకున్నా.. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు అడిగారు కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు అని అన్నారు సురేఖ వాణి.

సురేఖ వాణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.