
సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం ఇటీవల సినీ పరిశ్రమలో జరుగుతున్న మార్పులు, ప్రస్తుత తరం నటీమణులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, తన కెరీర్ నిర్ణయాలు, అలాగే తన సామాజిక సేవా కార్యక్రమాలపై అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆధునిక తరం నటీమణుల గురించి మాట్లాడుతూ, వారికి అద్భుతమైన ఎక్స్‌పోజర్, నాలెడ్జ్, బాడీ లాంగ్వేజ్, మేకప్ వంటి అంశాలపై పట్టు ఉందని సుహాసిని ప్రశంసించారు. ఫిల్మ్ క్రాఫ్ట్ గురించి కూడా వారికి మంచి అవగాహన ఉందని అన్నారు. అయితే, తన తరానికి వచ్చినంత మంచి రోల్స్ వారికి లభించడం లేదని అన్నారు. పాత రోజుల్లో ఒక డజన్‌కు పైగా నటీమణులకు మంచి పాత్రలు దక్కేవని, ఇప్పుడు ఆ అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంటరయ్యే అమ్మాయిలు షార్ట్ టర్మ్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తున్నారని, లాంగ్ పీరియడ్ గుర్తుపెట్టుకునే పాత్రలపై అంత దృష్టి పెట్టడం లేదని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
తన కెరీర్లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను కూడా సుహాసిని పంచుకున్నారు. స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అక్కగా నటించే ఆఫర్ వచ్చిందని, అయితే తాను ఆ పాత్రను తిరస్కరించానని చెప్పారు. దానికి బదులుగా చిరంజీవితో ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలు ఉంటే చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. రేపు కమల్ హాసన్‌కు అక్కగానో, తల్లిగానో అడిగితే అది ప్రపంచం సహజ స్వభావమేనని, దానిని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. నటీనటులు కేవలం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాంటివారని, కథకు ఎవరు సరిపోతే వారే ఆ పాత్రను పోషిస్తారని ఆమె పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‌లో తగ్గని డిమాండ్..
మహానటి సినిమాలో నటించడం తన అదృష్టమని సుహాసిని అన్నారు. ఆ సినిమా కథ తన చుట్టూ తిరగడం, అలాంటి అవకాశం రావడం అరుదైన విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా ప్లానింగ్‌లో ఉందని, అది 45 నుండి 65 ఏళ్ల వయస్సు మధ్య ఉండే పాత్ర అని, టైటిల్ క్యారెక్టర్ కూడా తనే పోషిస్తానని తెలిపారు. ఇలాంటి అవకాశాలు లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..