
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది సోనియా సింగ్. అందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ అమ్మడి అభినయం అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సోనియా సింగ్ పలు షార్ట్ ఫిల్మ్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధుతో కలిసి ఆమె చేసిన ‘రౌడీ బేబీ’, ‘హే పిల్ల’ యూట్యూబ్ ఛానల్స్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఈ పాపులారిటీతోనే సినిమాల్లో అవకాశం సంపాదించుకుంది. 2023లో ‘విరూపాక్ష’ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్బతంగా నటించింది. ఆ తర్వాత నితిన్, శ్రీలీల ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లో ఓ లేడీ కానిస్టేబుల్ గా నవ్వులు పంచింది. ఇక పవన్ సిద్దూతో కలిసి శశి మథనం అనే ఓటీటీ సినిమాతోనూ ఆడియెన్స్ ను మెప్పించింది. అలాగే ఢీ వంటి టీవీ ప్రోగ్రామ్స్, షోస్ లోనూ సందడి చేస్తోందీ అందాల తార. మొత్తానికి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్ తో బాగానే సంపాదిస్తున్నట్లుంది సోనియా సింగ్. ఈ క్రమంలోనే తాజాగా రెండు నెలల గ్యాప లోనే మరో ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేసిందీ అందాల తార. ఇందుకు సంబంధించిన విశేషాలను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసిందీ ముద్దుగుమ్మ. కొత్త కారు కొన్న సోనియా హైదరాబాద్ లో ఓ టెంపుల్ దగ్గర పూజలు చేయించింది. ‘దేవుడి ప్లాన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుంది. ప్రయాణం కష్టంగా ఉన్నా దేవుడ్ని మర్చిపోవద్దు. మన కోసం ఏదైనా గొప్పగా చేస్తున్నాడు అని ఎదురుచూడాలి’ అంటూ తన ఫొటోలు, వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం సోనియా సింగ్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సోనియా కొన్నకార్ బెంజ్ ఫోర్ మ్యాటిక్ అని తెలుస్తుంది. మార్కెట్లో దీని ధర దాదాపు 1.39 కోట్ల నుంచి 1.50 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. ఈ రేటు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
కాగా సుమారు రెండు నెలల క్రితం అంటే మార్చి లో ర్సిడెజ్ బెంజ్ సీ క్లాస్ కారుని కొనుగోలు చేసింది సోనియా సింగ్. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్దూను కూడా తీసుకొచ్చింది. ఆ కారు ధర రూ.60-80 లక్షలకు పైగానే ఉంది. మొత్తానికి సోనియా రేంజ్ మారిపోయిందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.