Seerat Kapoor: ఆ హీరో ప్రాపర్టీ అంటూ నెటిజన్ చీప్ కామెంట్స్.. ఇచ్చి పడేసిన హీరోయిన్

రన్ రాజా హీరోయిన్ హీరోయిన్ సీరత్ కపూర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా సీరత్ కపూర్ అతనితో కలిసి దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇదే అదునుగా కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.

Seerat Kapoor: ఆ హీరో ప్రాపర్టీ అంటూ నెటిజన్ చీప్ కామెంట్స్.. ఇచ్చి పడేసిన హీరోయిన్
Seerat Kapoor

Updated on: May 13, 2026 | 6:58 AM

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కొందరు ఆకతాయిలైతే హీరోయిన్ల విషయంలో మరీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. వారిని అసభ్యకరంగా దూషిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తే మరికొందరు మాత్రం తమను ట్రోల్ చేసిన వారికి అంతే గట్టిగా బుద్ధి చెబుతుంటారు. తాజాగా రన్ రాజా హీరోయిన్ సీరత్ కపూర్ అదే జరిగింది. తనను అసభ్యకరంగా దూషించిన ఓ నెటిజన్ కు తన దైన శైలిలో ఇచ్చిపడేసిందీ అందాల తార. వివరాల్లోకి వెళితే..  ఇటీవల ఓ స్టార్ హీరో పుట్టిన రోజు న సీరత్ కపూర్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోలో  హీరోతో సీరత్ కపూర్ క్లోజ్ గా ఉండడం చూసి కొందరు నెటిజన్లు రెచ్చిపోయారు. అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఒక నెటిజన్ ఏకంగా సీరత్ కపూర్ ను  ఆ హీరో ప్రాపర్టీ అంటూ సంభోదించారు.

ఇది గమనించిన సీరత్ కపూర్ సైలెంట్ గా ఉండలేకపోయింది. వెంటనే సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘హార్ట్ ఎమోజీలు పెట్టినంత మాత్రాన ఆ కామెంట్ గౌరవప్రదం మారిపోదు. ఒక మహిళ ఎవరికీ ఆస్తి కాదు. ఆమెకు తనకంటూ సొంత కలలు, గొంతు, గుర్తింపు ఉంటాయి. ఎవరినైనా అభిమానించేటప్పుడు గౌరవంతో ఉండండి.. కానీ సొంతం భావించొద్దు’అని కౌంటర్ ఇచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. సీరత్ కపూర్ కు అందరూ మద్దతు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

సీరత్ కపూర్ లేటెస్ట్ ఫొటోస్..

సీరత్ కపూర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. రన్ రాజా రన్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిందీ అందాల తార. ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీల, మనమే వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది. ‘సేవ్ ది టైగర్స్’ వంటి వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఆడియెన్స్ ను కూడా మెప్పించిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ‘జాతస్య మరణం ధ్రువం’, ‘ది బ్లాక్ గోల్డ్’ తదితర సినిమాలు ఉన్నాయి.

రాజమౌళితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us