వివాదాస్పద యూట్యూబర్ నందన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం హైదరాబాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, నకిలీ వీసా కేసులో లీగల్ అడ్డంకులు, లుక్ అవుట్ నోటీసుతో ఆమె అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. లీగల్ క్లియరెన్స్ కోసమే నందన నగరానికి వచ్చారని, సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్లియరెన్స్ రాగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు.