Tollywood: డ్యాన్స్‏ ఇరగదీసిన స్టార్ హీరో భార్య.. వీడియోతో మెంటలెక్కించిన హీరోయిన్..

దక్షిణాది చిత్రపరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్.. చాలా కాలం తర్వాత డ్యాన్స్ ఇరగదీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Tollywood: డ్యాన్స్‏ ఇరగదీసిన స్టార్ హీరో భార్య.. వీడియోతో మెంటలెక్కించిన హీరోయిన్..
Sayyesha

Updated on: Apr 05, 2025 | 10:49 AM

తమిళ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ సాయేషా. 2015లో విడుదలైన ‘అఖిల్’ అనే తెలుగు చిత్రం ద్వారా సాయేషా నటిగా అరంగేట్రం చేసింది. 2016లో విడుదలైన ‘శివాయ్’ అనే హిందీ చిత్రంలో ఆమె నటించింది. ఆ తర్వాత సంవత్సరం విడుదలైన ‘వనమగన్’ చిత్రంలో ఆమె ఆర్య సరసన నటించింది. ‘కడైకుట్టి సింగం’, ‘జుంగా’, ‘గజినీకాంత్’, ‘కాప్పాన్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. కోలీవుడ్ హీరో ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సాయేషా. వీరిద్దరి వివాహం 2019లో జరిగింది. వీరికి ఒక పాప ఉంది. వివాహం తర్వాత, సాయేషా ఆర్యతో కలిసి ‘టెడ్డీ’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు.

కొన్నాళ్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న సాయేషా..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 2023లో వచ్చిన ‘పట్టు తల’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది సాయేషా. ఇదిలా ఉంటే.. తాజాగా నెట్టింట ఆమె షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతుంది. అందులో 2013 బాలీవుడ్ లో వచ్చిన రేస్ 2 సినిమాలోని లాడ్ లక్ కైయీ పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సాయేషా టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

అక్కినేని అఖిల్ సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అఖిల్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా చేయలేదు సాయేషా. కానీ ఈ అమ్మడుకు ఎక్కువగా తమిళంలోనే ఆఫర్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..