
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
విరూపాక్ష తర్వాత చాలా సినిమాలు వచ్చాయి నేను మాత్రం సెలెక్టెడ్ గా చేస్తున్నాను. బింబిసారా, విరూపాక్ష, సార్ భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశాను. అయితే రిలీజ్ టైమ్స్ డిఫరెంట్ గా అయ్యాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ, ఆ తర్వాత అఖండ 2 సైన్ చేశాను. ఆ తర్వాత పూరి గారి సినిమా చేశాను. ప్రతి కథలో కంటెంట్ నచ్చి చేస్తున్నాను. ఇలాంటి కథ ప్రేక్షకులు ఇష్టపడతారు, వారికి నచ్చుతుంది అని ఉద్దేశంతోనే చేస్తాము. అది ఫైనల్ గా ఆడియన్స్ కి నచ్చితే వెరీ హ్యాపీ.
అఖండ2 ప్రాజెక్టు లోకి ఎలా వచ్చారు అన్నప్రశ్నకు సంయుక్త మాట్లాడుతూ.. డైరెక్టర్ గారు ఈ కథ గురించి చెప్పారు. ముందు డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగాను. లేవని చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పాను. అప్పుడు వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేశారు. బోయపాటి గారు చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఇమాజినేషన్ కి మించి ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్ గా వుంటుంది. సినిమాలో సాంగ్ చేయాలని చెప్పారు. నాకు నిజంగా ఆ పాట విన్న తర్వాత చాలా నెర్వస్ గా అనిపించింది. అంత మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు. తప్పకుండా సాంగ్ ని అద్భుతంగా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు రోజులు ప్రాక్టీస్ తర్వాత నా మోకాలు సహకరించలేదు. తర్వాత ఫిజియోథెరపీ తీసుకున్నాను ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన తర్వాత వాళ్లని ఎంటర్టైన్ చేయాలి. అదే నా ఫైనల్ గోల్. నా క్యారెక్టర్ ఎందులో చాలా స్టైలిష్ గా ఉంటుంది. బాలయ్య గారు చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషిలాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బాలయ్య గారికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే చాలా పాషన్ . ఆయన చాలా అంకితభావంతో అక్కడ పనిచేస్తున్నారు. తొలిసారి కలిసినప్పుడే క్యాన్సర్ కి అవగాహన కల్పించే ఒక కార్యక్రమానికి వెళ్ళమని చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .