దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే రూల్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్ల మధ్యలో..! డిమాండ్ ఉన్నంత మేరకే రెమ్యూనరేషన్ వసూళ్ చేయాలనే.. వారి ఆలోచిన మధ్యలో.. సామ్ నిర్ణయం తీసుకున్నారు. తన రెమ్యూనరేషన్ పై కంట్రోల్ మొత్తం ప్రొడ్యూసర్‌కే ఇచ్చారు. దీన్నే తాజాగా కన్‌ఫెస్ చేసి.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమాతో.. ఏప్రిల్ 14న మన ముందుకు వస్తున్న సమంత.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో తన రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తనకు పారితోషికం ఇంత ఇవ్వండి.. అంత ఇవ్వండని ఎవర్నీ అడుక్కోవాల్సిన అవసరం లేదన్నారు సమంత. తన శ్రమ చూసి స్వయంగా నిర్మాతలే.. అది డిసైడ్ చేస్తారన్నారు. ఇంత రెమ్యూషనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాం అని వారే తనకు నేరుగా చెబుతారన్నారు సమంత. అంతేకాదు ఇదంతా.. మనం చేసే కష్టం, కృషి ఆధారంగా వస్తుందని నమ్ముతానన్నారు. మన శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలే తప్పా.. రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకూడదంటూ.. హీరోయిన్లకు చెంపచెడెళ్లు మనేలా మాట్లాడారు.