Sai Pallavi: విరాటపర్వం సినిమా పై సాయి పల్లవి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నదంటే ?..

|

Jul 02, 2022 | 7:25 AM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Sai Pallavi: విరాటపర్వం సినిమా పై సాయి పల్లవి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నదంటే ?..
Sai Pallavi
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం (Virata Parvam) సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 1990లో తెలంగాణలో జరిగిన ఓ యాదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. రానా, సాయి పల్లవి నటనతో మెప్పించారు. విరాటపర్వం చిత్రయూనిట్ అందరికీ ఈ సినిమాకు ప్రత్యేక ప్రయాణంగా నిలిచింది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్నగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించారు.

ఇదిలా ఉంటే.. విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూలై 1 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి విరాటపర్వం సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ సినిమాలో తాను చేసిన వెన్నెల పాత్ర ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రల్లో కంటే ఒక మరపురాని రోల్ అని.. వెన్నెలగా నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నానని.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విరాట పర్వం సినిమాను అందరూ చూడండి అంటూ రిక్వెస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలోని వెన్నెల పాత్రకు సంబంధించిన ఫోటో స్టిల్స్ షేర్ చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు సాయి పల్లవి సూర్య, జ్యోతిక నిర్మాణంలో రాబోతున్న గార్గి చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.