Ritu Varma: క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. కొంటె చూపుతో కవ్విస్తోన్న రీతువర్మ..

ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..

Ritu Varma: క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. కొంటె చూపుతో కవ్విస్తోన్న రీతువర్మ..
Ritu Varma

Updated on: Jun 08, 2023 | 4:21 PM

తెలుగమ్మాయ్ రీతూవర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా దిగింది. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కేశవ’, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ అభిమానులను ఆకట్టుకుని.. ఎంతో పాపులారిటీని సంపాదించింది. యువ హీరోలతో పాటు పలువురు అగ్రనటుల సరసన సైతం ఈమె నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందం, అభినయం ఉన్న ఈ భామకు భారీ ఆఫర్స్ అయితే రావాడం లేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ భామ. కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యడితాల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కనులు కనులను దోచాయంటే అనే టైటిల్ తో డబ్ అయ్యింది.

ఈ సినిమా తెలుగులోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ అమ్మడి క్యూట్ ఫొటోస్ కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.