రిచా గంగోపాధ్యాయ..ఈ బబ్లీ హీరోయిన్ హాట్, హాట్ అందాలతో ‘మిరపకాయ’, ‘మిర్చి’ వంటి సినిమాల్లో సందడి చేసిన విషయం తెలిసిందే. చాన్నాళ్ల క్రితమే సినిమాలకు టాటా చెప్పిన ఈ బ్యూటీ..తను పుట్టిన ఫారిన్ వెళ్లి తన హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేస్తోంది. అయితే ఇటీవల ఈమె పెళ్లి న్యూస్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని..సోషల్ మీడియా కోడై కూసింది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సర్కులేట్ అయ్యాయి.
అయితే రహస్య వివాహ వార్తలను రిచా గంగోపాధ్యాయ ఖండించింది. అసలు తన పెళ్లి ఎప్పుడో మూడు నెలల క్రితం జరగిందని..తనపై ఈ రకమైన వార్తల్లో ఎందుకు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఆమె పెరిగిన మిచిగాన్ ప్రాంతంలో ఇండియా, అమెరికా సంప్రదాయాల ప్రకారం మ్యారేజ్ జరిగినట్టు పేర్కొంది. ఇక ఈ వార్త విని శుభాకాంక్షలు తెలపిన ప్రతి ఒక్కరికి రిచా థ్యాంక్స్ చెప్పింది. కాగా రిచా, ఆమె భర్త ఎంబీఏ క్లాస్ మేట్స్ అట. సెకండ్ ఇయర్ వరకు ఒకరితో ఒకరు మాట్లాడుకోలోదని, ఒక్కోసారి జీవిత భాగస్యామి పక్కనే ఉన్నా గుర్తించలేమని ఈ చిన్నది చెప్పుకొచ్చింది. గొప్ప వివాహాం, స్వచ్ఛమైన ప్రేమకథ తన లైఫ్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన రిచా..అందరికి క్రిస్మస్ విషెస్ తెలిపింది.
Thanks everyone for the kind wishes ??. Married a little over 3 months to the love of my life and couldn’t (cont) https://t.co/N7kZJvSf8h
— Richa Gangopadhyay (@richyricha) December 19, 2019