Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్.

Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..
Akira

Updated on: Apr 08, 2022 | 3:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్.. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నటి రేణు దేశాయ్ తన కొడుకు అకీరా బర్త్ డే సందర్భంగా అతనికి  సంబంధించి ఓ స్పెషల్ వీడియో షేర్ చేస్తూ  విషెస్ తెలిపారు. ” అకీరా నాకు మంచి కొడుకు అలాగే.. ఆద్యకు అద్భుతమైన సోదరుడు.. తన స్నేహితులకు గొప్ప స్నేహితుడు.. దయగలవాడు, నిజాయితీపరుడు.. జెంటిల్ మెన్. ఈరోజు తను పెద్దవాడైనందున తనకు అన్ని సంతోషాలు, శాంతి ఉండాలని కోరుకుంటున్నాను.. అకిరాకు మీరు అందించిన అన్ని అందమైన శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చింది రేణు దేశాయ్.

అకిరా 2004 ఏప్రిల్ 8న జన్మించాడు. పవర్ స్టార్  తనయుడు అకీరా గురించి తెలుసుకునేందుకు పవన్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తనకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు రేణు దేశాయ్. మెగా ఫ్యామిలీ లో జరిగే కార్యక్రమాలకు అకీరా పాల్గొంటూ ఉంటాడు. ఆసమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతూ ఉంటారు. అయితే తాజాగా రేణ్ దేశాయ్ షేర్ చేసిన వీడియోలో అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ జానీ సినిమాను గుర్తుచేసుకుంటున్నారు.

Also Read: Ghani Movie Review: గెలవాలనుకున్న వాడి కథ ‘గని’..

Mahesh Babu: ఒకే రోజు 30 మందికి ప్రాణ దానం.. మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్‌..

Vaani Kapoor: సోషల్ మీడియాలో ఫోటో షూట్స్‌తో దుమారం రేపుతున్న నాని హీరోయిన్

Sarkaru Vaari Paata: మహేష్ మూవీకి పోటీగా మార్వెల్.. సర్కారు వారి పాట టైమ్‌లోనే ఆ హాలీవుడ్ సినిమా