Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఒకప్పుడు తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవత ఆమె. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో కట్టిపడేసింది. సినీరంగంలో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూ తన జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్..
Uday Kiran

Updated on: Jun 26, 2026 | 8:15 AM

తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుల హృదయాలు దొచుకున్న తారలు చాలా మంది ఉన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్లలో రేఖ వేదవ్యాస్ ఒకరు. ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఆమె.. మొదటి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగులో రేఖకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ త్రవాత తారకరత్న సరసన ఒకటో నంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరాం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే ఇండస్ట్రీలో స్టా్ర్ హీరోయిన్ కావాల్సిన రేఖ.. కెరీర్ పీక్స్ లో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేఖ.. అటు సోషల్ మీడియాలో సైతం కనిపించలేదు. కానీ కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై ఓ షోలో సడెన్ గా ప్రత్యేక్షమయ్యింది. అప్పుడు రేఖ లుక్ చూసి అందరూ షాకయ్యారు. పూర్తిగా బక్కిచిక్కిపోయి.. నీరసంతో కనిపించడంతో రేఖకు ఏమైందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో తన అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న రేఖ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ.. తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఆనందం సినిమా మంచి గుర్తింపు ఇచ్చిందని.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినట్లు తెలిపింది. కానీ అదే సమంయలో కొన్ని ఆఫర్స్ సైతం మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా దివంగత హీరో ఉదయ్ కిరణ్ సరసన ఏకంగా మూడు సినిమాలు మిస్ అయినట్లు తెలిపింది. ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని సినిమాకు ముందుగా తననే ఎంపిక చేశారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ చేయలేకపోయినట్లు చెప్పుకొచ్చింది. అలాగే మరో రెండు సినిమాలు సైతం మిస్ అయినట్లు తెలిపింది. అలాగే తాను సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

తాను ఎప్పుడూ కావాలని సినిమాలను వదిలేయలేదని.. అంతా విధి రాత అని అన్నారు. మనం ఒకటి అనుకుంటాం.. కానీ దేవుడు ఇంకొకటి నిర్ణయిస్తాడు. జీవితంలో ఒక దశంలో చాలా బాధపడ్డానని.. నరకం అనుభవించానని.. ఒకప్పుడు తనకు స్టార్ హీరోలతో అవకాశాలు వస్తుంటే.. అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయని అన్నారు. సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని.. జీవితంలో ఒక దశలో ఎంతో బాధపడ్డానని.. నరకం అనుభవించానని అన్నారు. ప్రస్తుతం తనకు మంచి రోల్ ఛాన్స్ వస్తే.. తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం రేఖ వేదవ్యాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

రేఖ వేదవ్యాస్..

 

Rekha Vedavyas

 

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us