Thalapathy Vijay : ప్రస్తుతం తమిళ్ హీరోలంతా తెలుగు దర్శకుల వైపు మగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు వరుసగా టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ధనుష్ , శివ కార్తికేయన్ , సూర్య, కార్తీ ఇలా ఒక్కొక్కరు తెలుగు సినిమాల వైపు అడుగులేస్తున్నారు. వీరితోపాటు దళపతి విజయ్ కూడా టాలీవుడ్ లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీస్ట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు దళపతి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి ఓ సినిమాకి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకోసం అదిరిపోయే కథను సిద్ధం చేశారు వంశీ. ప్రస్తుతం ఈ సినిమాలో ఇతర పాత్రలను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు వంశీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ను ఎంపిక చేయాలని చూస్తున్నారట మేకర్స్. రష్మిక ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అందాల భామ. ఇటీవలే పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది రష్మిక. ఇక ఈ అమ్మడు ఇప్పుడు విజయ్ తో రొమాన్స్ చేయనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు , కన్నడ , హిందీ సినిమాలతోపాటు తమిళ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది. ఇటీవలే కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలో మెరిసింది రష్మిక. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. విజయ్ సినిమాలో రష్మిక ఎంపిక అయ్యితే ఇక తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ బిజీగా మారిపోతుందంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ఇక్కడ చదవండి :