టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో రాశీ ఖన్నా (Rashi Khanna) ప్రత్యేకం.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఫర్జీ సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎప్పిటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్తున్న ఫోటోను షేర్ చేసింది రాశీ ఖన్నా..
నా మనసుకు దగ్గరనై సినిమా అంటూ డబ్బింగ్ పనులు మొదలయ్యాయంటూ చెప్పుకొచ్చింది. అలాగే డబ్బింగ్ స్టూడియోలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్న సెల్ఫీని షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రాశీ ఖన్నా.. తెలుగులో గోపిచంద్ సరసన పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య అక్కినేని ప్రధాన పాత్రలో వస్తోన్న థ్యాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Started dubbing for a project really close to my heart! Can’t wait for you to watch it! – FARZI ♥️ pic.twitter.com/pvvefokLok
— Raashii Khanna (@RaashiiKhanna_) May 28, 2022