ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

ప్రముఖ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రమ్యకృష్ణ. అమ్మ, అత్తా పాత్రలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రమ్యకృష్ణ.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు
Ramyakrishna

Updated on: Aug 27, 2026 | 1:53 PM

సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన ప్రముఖ నటి రమ్యకృష్ణ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రమ్యకృష్ణ తన కెరీర్ తొలినాళ్లలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో చిత్ర పరిశ్రమలో ఆమెకు “ఐరన్ లెగ్” అనే ముద్ర కూడా పడిందని గుర్తు చేసుకున్నారు రమ్యకృష్ణ. అయితే, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడి, తన అంకితభావంతో ముందుకు సాగారు. “ఆ రోజుల్లో సినిమా వద్దు అనుకుని వెళ్ళిపోయేంత పరిస్థితులు కూడా నాకు ఏర్పడ్డాయి” అని ఆమె తెలిపారు. తన కెరీర్ ప్రయాణంలో ఎదురైన కష్టాల నుంచి బయటపడటానికి, స్టార్‌డమ్ సాధించడానికి కారణం దర్శకుడు కే. రాఘవేంద్రరావు గారే అని, ఆయన తనకు దైవసమానమైన బ్లెస్సింగ్ అని రమ్యకృష్ణ స్పష్టం చేశారు. “ఆయన లేకపోతే నేను ఆ స్ట్రగుల్స్ దాటలేకపోయేదాన్ని. నేను ఒక స్టార్ అయ్యాను అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ రాఘవేంద్రరావు గారు” అని ఆమె అన్నారు.

ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే

“అల్లుడు గారు” చిత్రం తన కెరీర్‌కు ఒక ముఖ్యమైన మలుపు అని, ఆ తర్వాత “అల్లరి మొగుడు” వంటి చిత్రాలతో ఆమె మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నట్లు రమ్యకృష్ణ తెలిపారు. చెన్నై, హైదరాబాద్ మధ్య ప్రయాణిస్తూ, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రమ్యకృష్ణ  మాట్లాడుతూ.. కష్టపడాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి, కుదిరితే ఇతరులను సంతోషపెట్టాలి, లేదంటే హాని చేయకూడదు అనే సూత్రాన్ని తాను పాటిస్తా అన్నారు.

అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

అవార్డుల పట్ల తన అభిప్రాయం గురించి అడగ్గా, “అవార్డ్స్ డజంట్ మ్యాటర్” అని స్పష్టం చేశారు. కెరీర్ ప్రారంభంలో అవార్డులపై ఆసక్తి ఉండేదని, అయితే ఆ తర్వాత వాటిపై వ్యామోహం తగ్గిందని ఆమె అన్నారు. మంచి పాత్రలు చేసి, మంచి పని చేసి, ఇంటికి వచ్చి సంతోషంగా ఉండటం, తన వ్యక్తిగత ఆనందాన్ని కనుగొనడమే తనకు ముఖ్యమని తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వంటి అన్ని దక్షిణాది భాషల్లో రమ్యకృష్ణ నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. తాను నటించిన చిత్రాల సంఖ్యను కూడా ఆమె లెక్కపెట్టుకోలేదని తెలిపారు. “గెస్ట్ అప్పియరెన్సులు, ఒక సాంగ్‌లో యాక్ట్ చేసిన పిక్చర్స్ చాలా ఉన్నాయని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us