Rambha: సడన్‌గా తిరుమలలో ప్రత్యక్షం అయిన అలనాటి అందాల భామ రంభ..

అలనాటి అందాల తారల్లో రంభ(Rambha) ఒకరు. ఆమె నటించిన సినిమా ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. అప్పట్లో తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

Rambha: సడన్‌గా తిరుమలలో ప్రత్యక్షం అయిన అలనాటి అందాల భామ రంభ..
Actress Rambha

Updated on: Aug 22, 2022 | 8:54 PM

అలనాటి అందాల తారల్లో రంభ(Rambha) ఒకరు. ఆమె నటించిన సినిమా ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. అప్పట్లో తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి కుర్రకారు కలల రాణిగా రాణించారు రంభ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఈ బ్యూటీ. అలాగే తెలుగులో, తమిళ్ లో, హిందీలో కూడా సినిమాలు చేసి మెప్పించారు రంభ. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించారు రంభ. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి అలరించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయ్యారు రంభ.

తాజాగా ఈ అమ్మడు ఇండియాలో దర్శనమిచ్చింది. కలియుగదైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర రంభ మీడియా కంట పడ్డారు. స్వామివారి దర్శనానంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ… దర్శనం చాలా బాగా అయిందని చెప్పారు. తన సోదరి కూతురి వివాహానికి వచ్చానని ఫ్యామిలీతో కలిసి దేవుడిని దర్శించుకోవడానికి వచ్చానని రంభ తెలిపారు. ప్రస్తుతం ఇంతకు మించి ఏం మాట్లాడలేనని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

Loading...
Unable to load recommendations.
Follow Us