
హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ విషయాలు పంచుకుంటుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె టాలీవుడ్ హీరోస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు, ప్రభాస్‌లతో కలిసి నటించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో ఇప్పటికే పనిచేసినట్లు పేర్కొన్న రంభ, మహేష్ బాబు, ప్రభాస్‌లతో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు. తన నట జీవితంలో క్విక్ గన్ మురుగన్ చిత్రం ఒక కల్ట్ ఫిల్మ్‌గా నిలిచిందని రంభ గుర్తుచేసుకున్నారు. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర స్క్రిప్ట్ మొదట్లో తనకు అర్థం కాలేదని, అయితే తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే మ్యాంగో డాలీ పాత్రను అంగీకరించానని తెలిపారు. ఈ పాత్ర కోసం విగ్గుకు దాదాపు 15 రోజులు, కాస్ట్యూమ్స్‌కు ఏడు విభిన్న సెట్లు తయారు చేయడానికి చాలా సమయం పట్టిందని వివరించారు. ఈ సినిమాకు క్విక్ గన్ ఇన్ అమెరికా పేరుతో పార్ట్ 2 తీసే ఆలోచనలున్నాయని, తనకు తిరిగి కాల్ వచ్చిందని కూడా తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..
కెరీర్‌లో నో చెప్పడం కష్టమైనప్పటికీ, నచ్చని ప్రాజెక్టులను తిరస్కరించానని రంభ స్పష్టం చేశారు. కొన్ని తప్పుడు సినిమాలు చేసినప్పటికీ, వాటిని మరచిపోయి ముందుకు సాగానని, తన కెరీర్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని తెలిపారు. సహనటుల విషయానికి వస్తే, చిరంజీవి తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని, అందరూ తనతో చాలా సహకరించి, తనను గారాబం చేశారని రంభ అన్నారు. ఎవరూ తనపై ఫిర్యాదు చేయలేదని, తాను మంచి నటులతో పనిచేసినందుకు సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్‌తో పనిచేయలేకపోయానని, అయితే అమీర్ ఖాన్‌తో కోకా-కోలా యాడ్ చేశానని చెప్పారు. అలాగే తనకు మహేష్ బాబు, ప్రభాస్ అంటే ఇష్టమని.. ఆ ఇద్దరితో నటించాలని ఉందని తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
సమకాలీన హీరోయిన్లలో రమ్యకృష్ణతో పనిచేసేటప్పుడు భయం వేసేదని, అది పోటీ కాదని, ఆమె సీనియారిటీకి ఇచ్చే గౌరవమని చెప్పారు. ప్రస్తుత హీరోయిన్లలో త్రిష అంటే తనకు ఇష్టమని, ఆమె ఆప్యాయంగా మాట్లాడే తీరు నచ్చుతుందని తెలిపారు. తన అభిమాన పాట రాఘవేంద్ర రావు ముద్దుల ప్రియుడు సినిమాలోని సిరిచందనపు చెక్కలాంటి భామ అని పేర్కొన్నారు. స్పెషల్ సాంగ్స్‌లో నాచోరే నాచోరే పాట అంటే తనకు చాలా ఇష్టమని, దాని వల్ల తనకు ఎక్కువ గుర్తింపు లభించిందని అన్నారు. డ్యాన్సర్ల విషయానికి వస్తే, చిరంజీవి పట్ల అపారమైన అభిమానం ఉన్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ అంకితభావం, నృత్యంలో ఆయన కృషి తనకు పిచ్చి పట్టిస్తుందని, మైఖేల్ జాక్సన్ వచ్చినా ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని కొనియాడారు. చిన్నప్పుడు రాముడు-సీత ఆట ఆడేదానని, సీత పాత్ర తీసుకోవడానికి చీటింగ్ చేసేదానినని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఒకవేళ నటి కాకపోయుంటే, తన అల్లరిని చూసి 18 ఏళ్ళకే పెళ్లి చేసేసేవారని తన తండ్రి చెప్పేవారని రంభ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
Mahesh, Prabhas, Rambha
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..