
టాలీవుడ్ సినీప్రియులకు హీరోయిన్ రాశి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మారింది. అప్పట్లో బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి మెప్పించింది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా హిట్స్ చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ఆమె చేసిన ఒక సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందట. ఆ మూవీతో తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాశి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దర్శకుడు తేజ రూపొందించిన నిజం సినిమా తన కెరీర్‌కు ఎలా మలుపు తిప్పిందో తెలిపారు. తేజ తనను ఆ సినిమా కోసం పిలిచి, గోపీచంద్ పాత్ర తనదని, మహేష్ బాబు తర్వాత వస్తారని కథ చెప్పినప్పుడు తాను సానుకూలంగానే భావించినట్లు రాశి తెలిపారు. తేజ కోరిక మేరకు బరువు తగ్గడం, లెన్స్‌లు పెట్టుకోవడం, మేకప్ లేకుండా కేవలం లిప్‌స్టిక్, కాజల్‌తో సహజమైన లుక్‌లోకి మారడం వంటి మార్పులు చేసుకున్నానని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
కానీ షూటింగ్ మొదటి రోజునే ముందుగా తనకు చెప్పని ఒక అభ్యంతరకరమైన సన్నివేశాన్ని చిత్రీకరించారని రాశి అన్నారు. ఆ సన్నివేశం తన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని, తన కెరీర్‌కు అది ఫుల్‌స్టాప్ పెడుతుందని ఆందోళన చెందానని తెలిపారు. తాను ఆ సీన్ చేయడానికి నిరాకరించగా, తన పి.ఆర్.ఓ. బాబూరావుతో సహా చాలా మంది తనను ఒప్పించడానికి ప్రయత్నించారని చెప్పారు. చివరికి అయిష్టంగానే ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని రాశి వివరించారు. ఆ తర్వాత డబ్బింగ్ కూడా పూర్తి చేశాక, తేజ తనకు క్షమాపణలు చెప్పారని, అయితే ఆ క్షమాపణలు తన కెరీర్ నష్టాన్ని పూడ్చలేవని ఆమె స్పష్టం చేశారు. ఆ ఒక్క పాత్రతో ప్రేక్షకులు నిరాశపడి ఉంటే, నిజంగానే తన కెరీర్‌కు ముగింపు పలికేదని రాశి అభిప్రాయపడ్డారు. ఆ సినిమా తర్వాత తాను సినిమాలు చేయలేదని, అది తన కెరీర్‌కు పెద్ద దెబ్బ అని ఇప్పటికీ భావిస్తున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
నిజం సినిమాతో చేదు అనుభవం ఎదురైనప్పటికీ, తేజ దర్శకత్వంలో వచ్చిన కేక, కాజల్ అగర్వాల్ తొలి చిత్రం లక్ష్మీ కళ్యాణం వంటి సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పానని రాశి అన్నారు. తాను ఇండస్ట్రీలో మర్చిపోవాలనుకునే డైరెక్టర్ ఎవరు అని అడిగితే, తానెప్పుడూ తేజ పేరే చెబుతానని అన్నారు. తాను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పారు. నో అంటే నో అని స్పష్టం చేశారు. జీవితంలో సారీ, థాంక్యూ వంటి పదాలను చాలా విలువైనవిగా భావిస్తానని, తప్పు చేసినప్పుడు మాత్రమే సారీ చెబుతానని తెలిపారు. తన జీవితంలో తనకు దొరికిన తల్లిదండ్రుల కోసం దేవునికి కృతజ్ఞతలు చెబుతానని అన్నారు.
Raasi, Nijam Movie
ఇవి కూడా చదవండి : Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..