బాబోయ్.. ఆ హీరోతో సినిమాలు చేయడం చాలా కష్టం.. చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ..

తెలుగు సినిమా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తారలలో ప్రేమ ఒకరు. గ్లామర్ బ్యూటీగానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ సక్సెస్ అందుకుంది. అప్పట్లో వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినిమాల్లో కనిపించని ప్రేమ.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాబోయ్.. ఆ హీరోతో సినిమాలు చేయడం చాలా కష్టం.. చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ..
Prema

Updated on: Jan 14, 2026 | 6:17 PM

తెలుగు సినీప్రియులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మొదట్లో నటనా రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, తల్లి ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేసిన ఆమె.. అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. తక్కువ సమయంలోనే అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రేమ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కొన్ని సినిమాల తర్వాత “ఓం” సినిమా విజయంతో కెరీర్‌లో కీలక మలుపు వచ్చిందని అన్నారు ప్రేమ. అలాగే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, తన కుటుంబంలో ఎవరూ కళాకారులు లేకపోవడంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని ప్రేమ తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు ఉపేంద్రతో పనిచేయడం ఒక పెద్ద సవాలని అనేక మంది నటులు భావించేవారని, ఆ అనుభవం తనను మరింత బలంగా మార్చిందని ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఉపేంద్రతో కలిసి పనిచేయడం అనేక మంది నటులకు కష్టతరమైన అనుభవం అని ప్రేమ వెల్లడించారు. “ఉపేంద్ర” సినిమాలో దామిని, రవీనా టాండన్, తాను కలిసి నటించామని, తమ పాత్రలు ఎంతో సవాలుతో కూడుకున్నవని అన్నారు. ఉపేంద్ర సహజత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తారని, సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన డిమాండ్ చేసిన సహజత్వం తనకు శాడిస్టిక్ అనిపించిందని, గ్లాస్ పీస్‌లు, నిప్పు మధ్య షూటింగ్ చేయాల్సి వచ్చిందని ప్రేమ వివరించారు. సినిమా బాగా రావడానికి ఉపేంద్ర ఎంతగా ఇన్వాల్వ్ అవుతారో, షూటింగ్ సమయంలోనే ఎడిటింగ్ గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారని ఆమె ప్రశంసించారు.

ఉపేంద్రతో చేసిన సినిమాలోని ఒక సన్నివేశాన్ని ప్రేమ గుర్తు చేసుకున్నారు. ఇంట్లోంచి లాక్కెళ్లి పడేసే సీన్‌లో, అది నిజంగా జరిగిందేనని, ఆ సమయంలో తన ప్రాణం పోతుందేమోనని భయపడ్డానని చెప్పారు. కానీ కెమెరా ఆన్ అయినప్పుడు, ప్రేక్షకులు చూస్తున్నారనే భావనతో ధైర్యంగా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని అన్నారు. ఉపేంద్రతో పనిచేసిన అనుభవం తనను చాలా బలంగా మార్చిందని, ఆ స్కూల్ తనకెంతో నేర్పిందని ప్రేమ తెలిపారు. ఆ తర్వాత మోహన్ బాబు, సురేష్ కృష్ణ వంటి పెద్ద నటులు, దర్శకులతో కలిసి “రాయలసీమ రామన్న చౌదరి” వంటి చిత్రాల్లో పనిచేయడానికి ఉపేంద్రతో చేసిన అనుభవమే ధైర్యాన్ని ఇచ్చిందని ప్రేమ స్పష్టం చేశారు. ఒకప్పుడు సెట్‌కి సమయానికి రావడంలో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు లేదని ప్రస్తుత పరిస్థితిపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Prema, Upendra

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..