
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్స్ లో అందాల భామ ప్రేమ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగుతోపాటు, కన్నడ, తమిళ్, మలయాలంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె..సడన్ గా సినిమాలకు దూరం అయ్యారు. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేశారు. 2017, 22లో రీఎంట్రీ ఇచ్చి ఓ రెండు సినిమాలు చేశారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ.. తన జీవితం.. ప్రేమ, పెళ్లి, ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో తన స్నేహితుల గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన కోఆర్టిస్ట్ దివంగత హీరోయిన్ సౌందర్య మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు ప్రేమ. ఆమెతో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ, సౌందర్య తనకు పోటీగా అనిపించలేదని, వారిద్దరి మధ్య ఎంతో అద్భుతమైన స్నేహం ఉందని చెప్పారు. సౌందర్య ఎక్కువ కన్నడ చిత్రాలు చేయకపోయినా, తెలుగులో ఆమెకు ఉన్న గొప్పతనం అపారమని ప్రేమ అన్నారు. సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా ఆమె బ్రదర్.. సౌందర్య ఫోటోస్ పెట్టి ఉన్నాయి. చూడగానే ఏదోలా అనిపించింది. వాళ్ల బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు. చూడటానికి కూడా ముఖం లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ. హార్డ్ వర్క్ తప్ప ఏమీ లేదు అనిపించింది. ఎప్పుడూ.. ఎవరితో మాట్లాడిన సౌందర్య అమ్మగారు ఏంతో ఏడ్చారు.
సౌందర్యతో నటించే రోజులు చాలా బాగుండేవి. తను చాలా తక్కువ తినేది. పప్పు, పాలక్, నెయ్యి, గోంగూర పచ్చడి. అవన్నీ తినడం ఆమె దగ్గరే నేర్చుకున్నారు. నేను అయితే షాట్ ఎప్పుడూ అయిపోతుందా అని వెయిట్ చేసేదాన్ని.. కానీ సౌందర్య మాత్రం ప్రతి షాట్ లో అందంగా కనిపించాలని అనుకునేది. ఎప్పటికప్పుడు మరింత అందంగా కనపడేలా చూసుకోవడం చేసేది. తనతో పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తొస్తుంటాయి అంటూ ఎమోషనల్ అయ్యారు ప్రేమ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..