Shamna Kasim: చమ్కీల అంగీలేసీ ఓ వదినే’ పాటకు బేబీ బంప్‌తో స్టెప్పులేసిన హీరోయిన్ పూర్ణ

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాని సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు.

Shamna Kasim: చమ్కీల అంగీలేసీ ఓ వదినే పాటకు బేబీ బంప్‌తో స్టెప్పులేసిన హీరోయిన్ పూర్ణ
Poorna

Updated on: Apr 02, 2023 | 8:33 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన చమ్కీల అంగీ అనే సాంగ్ తెగ చక్కర్లు కొడుతోంది. ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే పాట వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాని సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. నాని.. కీర్తి నటన వేరేలెవల్ కాగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు నాని కెరీర్ లో వచ్చిన అన్ని చిత్రాలకంటే దసరా బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది.

ఇక ఈ సినిమాలోని చమ్కీల అంగీ సాంగ్ తెగ పాపులర్ అయ్యింది. ఈ పాటకు సినిమా తారలు కూడా డాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ, లయ లాంటి వారు ఆ డాన్స్ వీడియోను పంచుకున్నారు.

తాజాగా ఈ పాటకు నటి పూర్ణ కూడా డాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి పీటలెక్కిన పూర్ణ.. ప్రస్తుతం గర్భవతిగా ఉంది. బేబీ బంప్ తోనే ఈ పాటకు డాన్స్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్ణ బేబి బంప్ నుంచి సీమంతం వరకూ తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అన్ని మూమెంట్స్‌ని ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.