సీనియర్ నరేష్-పవిత్ర లోకేష్‌పై ట్రోల్స్ రంకెలేస్తున్నాయ్. వీళ్లిద్దరిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఎటాక్ జరుగుతోంది. మార్ఫింగ్ ఫొటోలు, వల్గర్ కామెంట్స్‌తో ఓ ఆటాడుకుంటున్నారు. రోజురోజుకీ ట్రోల్స్ టార్చర్ పెరిగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పవిత్రా లోకేష్. తమపై అసభ్య ప్రచారం చేస్తోన్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని వెబ్‌సైబ్స్, యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా అసభ్య కథనాలు ఇస్తున్నాయంటూ ఆధారాలు సబ్‌మిట్ చేశారామె. తమపై జరుగుతోన్న ట్రోలింగ్‌ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర కంప్లైంట్‌తో 15 యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులిచ్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. మూడ్రోజుల్లోగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. నోటీసులందుకున్న యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులు ఇవాళ పోలీసుల ముందు అటెండ్‌కానున్నారు.
ఇదిలా ఉంటే నరేష్ భార్య రమ్యరఘుపతిపై ఫిర్యాదు చేశారు పవిత్ర. రమ్మ, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అడ్డంపెట్టుకొని నన్ను కించపరుస్తున్నారు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు పవిత్ర.
పవిత్రా లోకేష్ అందించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇంటరాగేట్ చేయనంది సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్. మెయిన్‌గా ఫొటోల మార్ఫింగ్, అసభ్య రాతలపై ప్రశ్నించనున్నారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా కథనాలు రాస్తున్నారు?. దీని వెనక ఎవరైనా ఉన్నారా?. ఇలా అనేక కోణాల్లో విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే, ఈసారికి హెచ్చరించి వదిలేస్తారా? లేక యాక్షన్ తీసుకుంటారా? అనేది చూడాలి.