రెచ్చగొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు.. ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉంది : నిత్యామీనన్

పెద్ది సినిమాలో జాన్వీ పాత్రను గ్లామర్ షో కోసమే చూపించారని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్న సమయంలోనే.. మూవీ మేకర్స్ దిద్దుబాటు చర్యలకు దిగారు. సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దర్శకుడు బుచ్చిబాబు కూడా స్పందించి.. సారీ చెప్పడంతో పాటు.. కొన్ని సీన్స్ మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.

రెచ్చగొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు.. ఇండస్ట్రీ మొత్తం ఇలానే ఉంది : నిత్యామీనన్
Nithya Menen

Updated on: Jun 08, 2026 | 4:56 PM

పెద్ది సినిమా కేంద్రంగా ఇప్పుడు చెలరేగిన కాంట్రవర్సీ ప్రతీ డైరెక్టర్‌కు ఒక లెస్సన్‌గా మిగిలిపోవాలి. ఎన్నో అంచనాలతో.. ఫుల్‌ క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా.. తొలిరోజు నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది కాని.. ఒక హీరోయిన్‌ విషయంలో వస్తున్న విమర్శలు డైరెక్టర్‌ బుచ్చిబాబును సైతం షేక్‌ చేశాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ను అందాలు చూపించడానికి తప్ప.. వేరే స్కోప్‌ లేదంటూ చాలామంది విమర్శలు చేశారు. ఇలాంటి పాత్రలు సృష్టించి ఏం మెసేజ్‌ ఇద్దామనుకున్నారంటూ చాలామంది సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్డారు. అసలే పెద్ద హీరో చిత్రం. ఆయన పక్కన ఆడిపాడేందుకు హీరోయిన్‌ ఉండాల్సిందే. ఇది ఫక్తు తెలుగు సినిమా ఫార్ములా.

దశాబ్దాల నాటి ఈ హిట్‌ ఫార్ములాకు ఇంకా కాలం చెల్లలేదా? అవే మూస ధోరణిని పట్టుకుని ప్రేక్షకులపై ఇంకా ఎన్నాళ్లు ఈ రుద్దుడు? ఇప్పటికే ఓటీటీల్లో హాలీవుడ్‌ టు కొరియన్‌ కంటెంట్‌ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ తరుణంలో ఇంకా ఇలా హీరోయిన్ల శరీరంపై సీన్లు తీస్తూ డబ్బులు చేసుకుందామని ఆలోచిస్తారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఒకప్పుడు మనకు తెలిసిన సినిమా ఇదే. అప్పుడు అంతా వర్కౌట్‌ అయింది. అప్పుడు ఇది సక్సెస్‌ ఫార్ములా మాత్రమే కాదు.. ఇలాంటి సీన్లు, పాటలు, మాటలు లేకపోతే ఏదో వెలితిగా ఉందే అంటూ సినిమాని తిరస్కరించారు ప్రేక్షకులు. కాని.. కాలం మారింది. కంటెంట్‌ మారింది. కాని డైరెక్టర్లు మాత్రం మారలేదు.

పెద్దిలో జాహ్నవి స్కిన్‌షోపై ఆడియన్స్‌ విసుగెత్తిపోయారు. మంచి స్పోర్ట్స్‌ డ్రామాలో ఇదేం హంగామా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే హీరోయిన్‌ గ్లామర్‌షో మీద ట్రోల్స్‌ వచ్చేసరికి.. కొందరు హీరోయిన్స్ స్పందిస్తున్నారు. ఇప్పటికే అనసూయ, ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి లాంటి హీరోయిన్స్ రియాక్ట్ అయ్యారు. మా తప్పేమి లేదు అంతా డైరెక్టర్స్ చెప్పిందే మేము చేస్తాం అని అంటున్నారు. తాజాగా ఇదే ఇష్యు పై హీరోయిన్ నిత్యామీనన్ కూడా రియాక్ట్ అయ్యింది. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గా చూపించడం ఒక్క సౌత్ సినిమాల్లోనే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందని  నిత్యా చెప్పుకొచ్చింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడొస్తున్న సినిమాలను మరీ కమర్షియల్ చేయడమే దీనికి ముఖ్యకారణమని.. బాక్సాఫీస్ దగ్గర డబ్బుల కోసం ప్రేక్షకులను రెచ్చగొట్టడానికి ఇలాంటి సీన్స్ సినిమాల్లో పెడుతున్నారు నిత్యా చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కు కొన్ని లిమిట్స్ ఉండాలి అలాంటి సీన్స్‌లో నటించడం ఇష్టం లేకపోతే ధైర్యంగా నో చెప్పాలి. ముందు ఇలాంటి కమర్షియల్ సినిమాలను ఒప్పుకొని ఆతర్వాత ఇలాంటి సీన్స్ నేను చేయను అంటే ఎవ్వరూ పట్టించుకోరు. నేను కూడా ఇలాంటి సీన్స్ చేయాల్సి వస్తుందని చాలా కమర్షియల్ సినిమాలు వదులుకున్నా అని తెలిపింది నిత్యామీనన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us