Nayanthara : విడాకుల వార్తల పై క్లారిటీ ఇచ్చిన నయనతార.. ఒక్క పోస్ట్‌తో ఇలా

|

Mar 06, 2024 | 2:03 PM

ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార విడాకులు తీసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఎక్కడ చూసినా నయన్ విడాకుల గురించే చర్చ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్‌ను నయనతార అన్‌ఫాలో చేసింది. దాంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. విడాకులపై కొన్ని మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. నయన్ విడాకుల వార్త వైరల్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Nayanthara : విడాకుల వార్తల పై క్లారిటీ ఇచ్చిన నయనతార.. ఒక్క పోస్ట్‌తో ఇలా
Nayanthara, Vignesh Shivan
Follow us on

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు భర్త విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా రాణిస్తుంటే.. ఇటు నయన్ హీరోయిన్ గా ఆచితూచి అడుగులేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే ఇటీవల ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార విడాకులు తీసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఎక్కడ చూసినా నయన్ విడాకుల గురించే చర్చ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్ శివన్‌ను నయనతార అన్‌ఫాలో చేసింది. దాంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. విడాకులపై కొన్ని మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. నయన్ విడాకుల వార్త వైరల్ అవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా నయనతార నుంచి ఓ క్లారిటీ వచ్చింది.

ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రెటీలు పెళ్లిపీటలెక్కుతుంటే.. మరికొంతమంది సెలబ్రిటీ జంటలు విడిపోతున్నారు. అలాగే నయన్ కూడా భర్త నుంచి విడిపోతుందని.. అందుకే విఘ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేసిందని వార్తలు పుట్టుకొచ్చాయి. నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్‌ను అన్‌ఫాలో చేయడం అభిమానులను షాక్ కు గురిచేసింది. అంతలోనే  కొద్దిసేపటికే మళ్లీ ఫాలో అవ్వడం మొదలుపెట్టింది.

ఫ్లూట్ వాయిద్యకారుడు నవీన్ పాత వీడియోని షేర్ చేసింది నయన్. నవీన్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే నయనతార, విఘ్నేష్ ప్రేమగా వింటూ కనిపించరు. ఇది జూన్ 2023 నెలలో జరిగింది. నవీన్ ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేశాడు. నయనతార  దాన్ని రీ షేర్ చేసింది.  దీంతో అంతా బాగానే ఉందని  క్లారిటీ వచ్చేసింది. నయనతారకు మంచి డిమాండ్ ఉంది. ‘జవాన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. జూన్ 9, 2022 న, నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్నారు. సరోగసీ ద్వారా ఈ దంపతులకు కవలలు పుట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.