కెరీర్ స్టార్టింగ్‌లో మంచి స్పీడు మీద కనిపించిన మెహరీన్ సడన్‌గా స్లో అయ్యారు. వెండితెర మీద వరుస ఫెయిల్యూర్స్ రావటం, అదే సమయంలో పర్సనల్ లైఫ్‌లోనూ డిస్ట్రబెన్సెస్ రావటంతో సినిమాకే కాదు సోషల్ మీడియాకు కూడా కాస్త డిస్టన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. లాంగ్ బ్రేక్ తరువాత ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కృష్ణగాడి వీరప్రేమగాథ, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించారు మెహరీన్ పిర్జాదా. అదే సమయంలో పెళ్లి కబురు కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. వరుస అవకాశాలు వచ్చినా మెహరీన్ కెరీర్‌లో హిట్స్ మాత్రం పెద్దగా రాలేదు. అదే సమయంలో ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ కావటంతో అమ్మడు కాస్త స్లో అయ్యారు. ఈ లోగా నెక్ట్స్ జెనరేషన్ బ్యూటీస్ స్పీడు పెంచటంతో మెహరీన్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఎఫ్ 3తో తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెడుతుందని భావించారు. కానీ ఆ సినిమా కూడా ఫెయిల్ అవ్వటంతో మెహరీన్ కెరీర్ కష్టాల్లో పడటంతో పాటు లాంగ్ బ్రేక్ కూడా వచ్చింది. ప్రజెంట్ ఈ బ్యూటీ నటించిన రెండు సినిమాలు రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుండగా తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమా అమ్మడి కిట్టీలో చేరింది. ఫస్ట్ టైమ్ ఓ లేడీ ఓరియంటెడ్ హారర్ థ్రిల్లర్ మూవీలో నటించబోతున్నారు మెహరీన్. మరి ఈ సినిమా అయిన మెహరీన్‌కు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.