ముఖం మీద మొటిమలు.. షూటింగ్ నుంచి పంపించేశారు.. ఎమోష్నలైన హీరోయిన్

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో ఆశలతో అడుగుపెడుతుంటారు. కొందరు హీరోయిన్స్ గా అడుగు పెట్టి సక్సెస్ సాధించారు . మరికొందరు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు .

ముఖం మీద మొటిమలు.. షూటింగ్ నుంచి పంపించేశారు.. ఎమోష్నలైన హీరోయిన్
Actress

Updated on: Jan 28, 2026 | 12:33 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం అంత సులభం కాదు.. హీరోయిన్ గా అడ్డుపెట్టడమే కష్టం అంటే.. ఒక్కసారిగా హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలంటే ఇంకా కష్టం..! రీసెంట్ డేస్ లో కొత్త హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలకు కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇక తెలుగులో ఎంతోమంది ముద్దుగుమ్మలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? పింపుల్స్ ఉన్నాయని తనను షూటింగ్ నుంచి పంపించేశారని తెలిపి షాక్ ఇచ్చింది ఆ అందాల భామ.

బాలీవుడ్ బ్యూటీ మన్నారా చోప్రా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్. ఇక మన్నార్ చోప్రా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రేమ గీమ జాంత నై అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సునీల్ జక్కన్న, సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాల్లో నటించింది. అలాగే రోగ్, సీత సినిమా లో నటించింది. ఇప్పుడు తిరగబడరా సామి అనే సినిమాలో చేస్తుంది. సినిమాలతో పాటు రియాల్టీ షోలలోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. పలు ప్రకటనల్లో కూడా నటించింది మన్నార. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ బ్యూటీ. ముఖం మీద మొటిమల కారణంగా ఓ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయానని తెలిపింది. కొంతమంది నటీమణులు ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనల్లో నటించడానికి ఇష్టపడరు. అయితే మన్నారా చోప్రా అలా కాదు. ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనలో నటించేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంది. అందుకోసం చాలా రౌండ్స్ ఆడిషన్ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే ఎట్టకేలకు ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ లో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే ఆ యాడ్ షూట్ చేసే సమయానికి తన మొఖం పై మొటిమలు వచ్చాయట. ఆమె మాట్లాడుతూ.. షూట్‌కి ముందు రోజు రాత్రి నా నుదిటిపై మొటిమ వచ్చింది. తెల్లవారుజామున నాలుగు గంటలకు యాడ్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు మొటిమలు ఎక్కువయ్యాయి. నేను వాటిని కనిపించకుండా చేద్దాం అని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. దాంతో నన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. అదే నా జీవితంలో మొదటి రిజక్షన్ అని మన్నారా చోప్రా తెలిపింది ఆ రోజు మన్నారా చోప్రా ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. మొటిమల కారణంగా ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నానని చాలా బాధపడిందట. మన్నారా చోప్రా హిందీ బిగ్ బాస్ 17′ షోపాల్గొంది. ఆ షోలో ఆమె 2వ రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 38 లక్షల మంది ఈ ముద్దుగుమ్మను ఫాలో అవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..