
మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. ఉన్నట్లుండి ఇలా జరగడంతో హీరోయిన్ తో పాటు అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోయారు. ఇక ఈ ఈవెంట్ యాంకర్ కూడా సదరు అభిమానిని గట్టిగా మందలించింది. మన దగ్గరకు వచ్చిన సినిమా సెలబ్రిటీలతో ఇలా ప్రవర్తించడం సరికాదని హెచ్చరించింది. అయితే సదరు మహిళ మాత్రం తను చేసిన పనిని సమర్థించుకుంది. ‘ నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా’ అని సమాధానమిచ్చింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ మంజు వారియర్ మాత్రం ఏ మాత్రం కోపగించుకోలేదు. ఇది జరిగిన తర్వాత కూడా ఎంతో ఓపికగా, సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతు ఫొటోలు, సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మంజు వారియర్ విషయానికి వస్తే దక్షిణాదిలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. మంజు కేవలం నటి మాత్రమే కాదు. డ్యాన్సర్, రైటర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ కూడా! మలయాళం సినిమాలో స్టార్ నటిగా వెలుగొందుతోన్న ఆమె పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది. ముఖ్యంగా మంజు వారియర్ నటించిన అసురన్, తునివు (తెగింపు), వేట్టయాన్, ఎల్2: ఎంపురాన్ సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కన్నెళుతి పొట్టుం తొట్టు చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందిన మంజు సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.
A female fan surprised Malayalam actress #ManjuWarrier with an unexpected #Lipkiss at a public event 🤯 pic.twitter.com/yeu3N9uywg
— Milagro Movies (@MilagroMovies) April 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.