Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయనతో నటించాలని ప్రతి హీరోయిన్ కలలు కంటారు. ఇప్పటికే చాలా మంది తారలు రజినీతో ఒక్క ఛాన్స్ వచ్చిన చాలు అనుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో సినిమా చేయడం వల్లే కెరీర్ పోయిందని అంటుంది. తనకు సినిమా అవకాశాలే రాలేదని తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా.

Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
Rajinikanth

Updated on: Dec 26, 2025 | 11:11 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దశాబ్దాల సినీప్రయాణంలో రజినీ ఎంతో మంది హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశారు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని స్టార్ డమ్ అందుకున్న తారలు ఉన్నారు. ఇప్పటికీ రజినీతో ఒక్క ఛాన్స్ అయినా రావాలని వెయిట్ చేస్తుంటారు. అయితే ఓహీరోయిన్ మాత్రం రజినీ సినిమాలపై సంచలన కామెంట్స్ చేసింది. ఆ కారణంగా తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

రజినీ సినిమాతో అవకాశాలు పోగొట్టుకున్న హీరోయిన్ మరెవరో కాదు.. మనీషా కోయిరాలా. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు దక్షిణాదిలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఒకే ఒక్కడు, బొంబాయి, భారతీయుడు వంటి చిత్రాల్లో నటించి సౌత్ అడియన్స్ హృదయాలు కొల్లగొట్టింది. నిజానికి సౌత్ లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి స్థానం సంపాదించుకుంది. అయితే దక్షిణాదిలో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడానికి కారణం రజినీ సినిమా అంటుంది మనీషా. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా బాబా.

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..

2002లో విడుదలైన బాబా చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు రాలేదని అంటుంది మనీషా. ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ మనీషా కెరీర్ పై పడిందని.. దీంతో ఆమెకు ఉన్న ఆఫర్స్ సైతం పోయాయని తెలిపింది. తాజాగా మనీషా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..