
గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మనోజ్ భూమా వారి అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ఇక ఇదే విషయంపై తాజాగా మనోజ్ అక్క… మంచు లక్ష్మి స్పందించారు. ఎవరి జీవితం వారిదంటూ రియాక్షన్ ఇచ్చారు. తమ్ముడు పెళ్లి చేసుకుంటే అక్క సంతోషించడం కామన్. ఇక ఇప్పుడు మంచు మనోజ్ విషయంలోనూ.. ఇదే చేశారు ఆయన అక్క మంచు లక్ష్మీ. మీ తమ్ముడు భూమా వారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు కదా.. దీనిపై మీ ఒపీనియన్ ఏంటని ఓ రిపోర్టర్ అడగగా…. వెంటనే ఎవరి గోల వాడిది.. ఎవరి పెళ్లి వాడిదనే స్టేట్మెంట్ ఇచ్చేసి అందర్నీ షాక్ చేశారు మంచు లక్ష్మీ.
ఇక ఫస్ట్ వైఫ్‌తో బ్రేకప్ తరువాత సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రెజ్యూమ్ అవుతున్నారు. తనే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో పాటే.. భూమా వారి చిన్నమ్మాయి భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకుంటున్నాననే హింట్ .. రీసెంట్ గణేష్ ఉత్సవాల వేళ ఇచ్చారు.
ఇక ఇదే విషయమై తాజాగా ఓ రిపోర్టర్ మంచు లక్ష్మిని అడగంతో.. తన మనసులో మాటను బయట పట్టారు. మనోజ్ పెళ్లి చేసుకుంటుంటే నేనేం అంటాను. ఎవడి గోల వాడిది.. ఎవడి బ్రతుకు వాడిది. ఎవరి జీవితం వాళ్లను బ్రతకనీయండి హానెస్ట్ ప్రేమను నేను బ్లెస్ చేస్తాను. ఈ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను. జీవితంలో ప్రేమ, భయం రెండు ముఖ్యమే. జీవితాన్ని ప్రేమతో లీడ్ చేస్తున్నామా ? లేదంటే భయంతో లీడ్ చేస్తున్నామా అని తెలుసుకోవాలి. నా లైఫ్ నేను ప్రేమతో గడుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు.