Actress : చికిత్స లేని వ్యాధితో పోరాటం.. ఆ నరకం భరించలేకపోతున్నా.. హీరోయిన్ కామెంట్స్..

సాధారణంగా సినీతారలు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటారు. కెరీర్ గురించి మాత్రమే కాకుండా తమ పర్సనల్ విషయాలను సైతం తెలియజేస్తుంటారు. ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్న వెల్లడించిన ఓ నటి.. ఇప్పుడు తాను బాధపడుతున్న వ్యాధి గురించి బయటపెట్టింది. ప్రతిసారి నరకం అనుభవిస్తున్నానని తెలియజేసింది.

Actress : చికిత్స లేని వ్యాధితో పోరాటం.. ఆ నరకం భరించలేకపోతున్నా.. హీరోయిన్  కామెంట్స్..
Malti Chahar

Updated on: Jan 02, 2026 | 10:29 PM

ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఇటీవల సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. తాజాగా తాను అనుభవిస్తున్న ఓ వ్యాధి గురించి అసలు విషయాన్ని రివీల్ చేసింది. ఆమె ప్రముఖ క్రికెటర్ సోదరి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవలి ఇంటర్వ్యూలో, తన జీవితంలో ఇప్పటివరకు సంబంధాల కారణంగా తాను ఎంత బాధను భరించాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఆమె పేరు మాల్తీ చాహర్. క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి. తాను 7వ తరగతిలో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని తెలిపింది. ఆ సమయంలో తనకు ‘అడెనోమైయోసిస్’ అనే వ్యాధి వచ్చినట్లు తెలిపింది. ఈ వ్యాధి రుతుక్రమానికి సంబంధించినదని.. దానికి చికిత్స లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

ఈ వ్యాధి వల్ల తాను ప్రతి నెల రుతుక్రమం సమయంలో ఎంతో నొప్పితో బాధపడుతున్నానని.. అందుకు ప్రతిసారి తాను ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని తెలిపింది. అది సాధారణ నొప్పి కాదని.. తన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని.. ఈ వ్యాధి వల్ల గర్భాశయం లోపలి భాగంలో ఎండోమెట్రియల్ కణాలు కండరాలలో పొందుపరచబడి ఉంటాయని.. దీంతో గర్భాశయం వాపు వస్తుందని తెలిపింది.అందుకే రుతుస్రావం సమయంలో తాను ఎంతో నొప్పితో బాధపడుతుంటానని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

ప్రస్తుతం ఈ నొప్పి కారణంగా తాను ప్రతిసారి ఎంతో బాధపడుతుంటానని.. నిరంతరం ఆసుపత్రికి వెళ్తుంటానని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తన తల్లిదండ్రులు రోజూ గొడవ పడేవారని.. తన సోదరుడు క్రికెట్ శిక్షణ కోసం ఇంటికి దూరంగా ఉండడంతో ఆ గొడవలు అతడిని అంతగా ప్రభావితం చేయలేదని చెప్పుకొచ్చింది. కానీ తాను ఇంట్లో ఉండటం వల్ల ఈ విషయాలు తనను ఎక్కువగా ప్రభావితం చేశాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..