Maheshwari: చిరంజీవి, నాగార్జున సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే నటించలేదు.. మహేశ్వరీ కామెంట్స్..

ఒకప్పుడు సినీరంగంలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లలో మహేశ్వరి ఒకరు. గులాబీ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అగ్ర తారలు చిరంజీవి, నాగార్జునలతో కలిసి నటించే అవకాశాలను తాను కోల్పోయానని ఆమె తెలిపారు. తాను చేయాల్సిన చిత్రాల్లో మరో హీరోయిన్స్ నటించారని గుర్తుచేసుకున్నారు.

Maheshwari: చిరంజీవి, నాగార్జున సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే నటించలేదు.. మహేశ్వరీ కామెంట్స్..
Maheshwari

Updated on: Jan 31, 2026 | 6:28 PM

హీరోయిన్ మహేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు, ఆ తర్వాత సీరియల్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ కు మహేశ్వరీ చిన్నమ్మ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. 90వ దశకంలో అగ్ర తారలైన చిరంజీవి, నాగార్జునలతో కలిసి నటించే అవకాశాలను కోల్పోయిన వైనాన్ని ఆమె వెల్లడించారు. నాగార్జున కథానాయకుడిగా నటించిన “రాముడొచ్చాడు” చిత్రంలో ఒక ముఖ్య పాత్రకు ఆఫర్ వచ్చిందని అన్నారు. సురేంద్ర అనే వ్యక్తి ద్వారా ఈ అవకాశం వచ్చిందని, అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఆ చిత్రాన్ని చేయలేకపోయానని ఆమె అన్నారు. ఆ సమయంలో తాను ఇంకా తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిందని ఇప్పుడు అనిపిస్తుందని చెప్పుకోచ్చారు. ఆ పాత్రను రవళి పోషించారని తెలిపారు. అలాగే, చిరంజీవి నటించిన “ఇద్దరు మిత్రులు” చిత్రంలోనూ తనకు అవకాశం వచ్చిందని, అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

పరిశ్రమలో తనకు ఎదురైన రెమ్యూనరేషన్ సమస్యల గురించి కూడా మహేశ్వరి మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో పారితోషికం చెల్లించకుండా ఎగ్గొట్టిన ఘటనలు ఉన్నాయని, అయితే తమ అసోసియేషన్ జోక్యంతో ఆ డబ్బును తిరిగి పొందగలిగామని ఆమె వెల్లడించారు. “కంబ్యాక్” అనే పదంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ, తాను ఎప్పుడూ పరిశ్రమను వదిలి వెళ్లలేదని, ఎప్పుడూ ఇక్కడే ఉన్నానని, కేవలం సరైన ఆఫర్లు రాకపోవడం వల్లే సినిమాలు చేయలేకపోయానని అన్నారు. సినిమా అంటే తనకు సర్వస్వమని, అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

తాను నటించాలని ఆకాంక్షించిన దివంగత నటీమణులు సావిత్రి, శ్రీదేవి అని మహేశ్వరి తెలిపారు. శ్రీదేవితో కలిసి “మై నేమ్ ఈజ్ మంగతాయారు” అనే ఒక ప్రకటనలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత తరం హీరోలు అందరూ తనకు పరిచయస్తులేనని, ట్రెండ్‌లో ఉన్నానని చెప్పారు. ఎన్.టి.ఆర్ నటించిన “దేవర” సినిమా షూటింగ్‌ సెట్ లో ఆయన డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. జాన్వీ కపూర్‌తో కలిసి ఒక పాటకు సంబంధించిన షూట్‌లో పాల్గొన్నానని కూడా తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..