మధుబాల 90వ దశకంలో చిత్ర పరిశ్రమను ఏలేసింది 1991లో కె బాలచందర్ దర్శకత్వం వహించిన అళగన్‌తో చిత్ర పరిశ్రమకు ఇచ్చిన మధు.. మణిరత్నం తీసిన రోజా సినిమాలో చాలా పాపులర్ అయింది. తన అమాయకమైన నటన, కళ్లు తిప్పుకోనివ్వని సౌంధర్యంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా కుర్రాళ్ల కలల దేవతగా మారింది. హిందీ , తెలుగు, తమిలం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె చిత్రాలు చేసింది. తెలుగులో అల్లరి ప్రియుడు, చిలక్కొట్టుడు, ఆవేశం, గణష్ సినిమాల్లో నటించింది మధుబాల. కాగా హేమా మాలిని, జుహీ చావ్లాలకు రిలేటివ్ అయిన ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న పెళ్లాడింది మధుబాల. వీరికి అమెయా, కెయా అనే ఇద్దరు తనయలు ఉన్నారు.
Also Read: హీరోయిన్లను మించిన అందం.. కట్టప్ప కూతురు ఎలా ఉందో చూశారా..?
పెళ్లి తర్వాత.. ఇండస్ట్రీ నుంచి స్మాల్ బ్రేక్ తీసుకున్న మధుబాల.. సెకండ్ ఇన్సింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రేమదేశం, శాకుంతలం, ఈగల్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. మంచు విష్ణు హీరోగా చేస్తోన్న కన్నప్పలోనూ కీ రోల్ పోషించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మధుబాల కుమార్తెలు కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. మధుభాల ఎప్పుడైనా తన కుమార్తెలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే… వెంటనే అవి ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్స్ క్వీన్.. ఈ జనరేషన్‌కు ఇద్దరు హీరోయిన్లను ఇచ్చావ్ అని కామెంట్ పెట్టగా.. కుమార్తెలకు కూడా అమ్మ అందమే వచ్చిందని మరొకరు వ్యాఖ్యానించారు. మరీ అమెయా, కెయాలకు సినిమాలపై ఉందా..? వారు చిత్ర పరిశ్రమకు వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..