Lavanya Tripathi: గుడ్ న్యూస్ చెప్పిన మెగాకోడలు లావణ్య.. ఆనందంలో అభిమానులు

మెగా హీరో వరుణ్ తేజ్ అందాల భామ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. హనురాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో లావణ్య తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది.

Lavanya Tripathi: గుడ్ న్యూస్ చెప్పిన మెగాకోడలు లావణ్య.. ఆనందంలో అభిమానులు
Lavanya Tripathi

Updated on: Feb 07, 2025 | 3:05 PM

మెగా మేనకోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగాను ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు. కొన్నాళ్లుగా లావణ్య నుంచి సరైన మూవీ రాలేదు. 2023 నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకుంది లావణ్య.

వరుణ్ తేజ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్ , అంతరిక్షం సినిమాల్లో వరుణ్, లావణ్య కలిసి నటించారు. కాగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్య మధ్య  పరిచయం ఏర్పడి ఆతర్వాత అది ప్రేమగా మారింది. ఆతర్వాత ఈ ఇద్దరూ తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. ఎట్టకేలకు 2023లో పెళ్లిపీటలెక్కారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. సినిమా చేస్తుంది లావణ్య. లావణ్య హీరోగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణ సారథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సతీలీలావతి అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ‘సతీ లీలావతి’ షూటింగ్ స్టార్ట్ అయినట్లు వెల్లడించింది లావణ్య. ‘‘సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అనే క్యాప్షన్ తో షూటింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి