ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావా నడుస్తోంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. కృతి శెట్టి, శ్రీలీల ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో జోరు మీదున్నారు. అలాగే రొమాంటిక్, లక్ష్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది యంగ్ బ్యూటీ కేతిక శర్మ (Kethika Sharma). ఈ రెండు సినిమాలు హిట్ కాకపోయినా.. నటనపరంగా కేతికకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో ఈ అమ్మడు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, వీడియోస్ ఆసక్తి పెంచాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
లేటేస్ట్ టాక్ ప్రకారం కేతిక మరో ఛాన్స్ కొట్టేసిందట. రంగ రంగ వైభవంగా సినిమా విడుదలకు ముందే ఆమె సాయిధరమ్ తేజ్ సరసన నటించనుందట. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సముద్రఖని వినోదయా సితం రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయిదరమ్ తేజ్ కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ సరసన కేతికను ఎంపిక చేశారట మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.