
సినీ సెలబ్రెటీల వ్యక్తిగత జీవిత ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమలు పెళ్లికి సంబంధించిన ఎన్నో న్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాలను మొదలుపెడుతుంటే.. మరికొందరు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. యంగ్ హీరోలు, యంగ్ హీరోయిన్స్ మాత్రమే కాదు సీనియర్ హీరోలు కూడా విడిపోతున్నాం అంటూ అనౌన్స్ చేసి అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఇటీవలే ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. తెలుగులో తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ అమ్మడు ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు.. అందాల భామ కీర్తిసురేష్. తెలుగులో తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మల్లో కీర్తిసురేష్ ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కీర్తి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక మహానటి సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు మరింత దగ్గరైయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అందాల భామ.మొన్నామధ్య పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. తన ప్రియుడు ఆంటోని తటిల్ ను కీర్తి 2024లో వివాహం చేసుకుంది.
వీరిద్దరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం జరిగింది. దాదాపు 15 ఏళ్లు రిలేషన్ లో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉంది కీర్తి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ.. ఆంటోనీ గురించి తన ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకోరని అనుకున్నాం.. ఒకవేళ మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనున్నా.. కానీ మా ప్రేమ గురించి చెప్పగానే పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు అలాగే ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేశారు. ఇంత గ్రాండ్ గా మా ఫ్యామిలీస్ సమక్షంలో మా పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. అందుకే పెళ్లి సమయంలో నేను నా భర్త ఎమోషనల్ అయ్యాం అని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్.
కీర్తిసురేష్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి