Kajal Agarwal: కాజల్ ఫస్ట్ క్రష్ అతడే.. కాలేజీ రోజుల్లోనే అమ్మాడి వన్ సైడ్ లవ్ స్టోరీ..

|

Apr 30, 2024 | 7:26 AM

ళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ రీఎంట్రీ ఇస్తుంది. లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసేందుకు సైతం రెడీ అయ్యింది. అయితే తాజాగా కాజల్ కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాలేజీ రోజుల్లోనే కాజల్ వన్ సైడ్ లవ్ స్టోరీ ఉందట.

Kajal Agarwal: కాజల్ ఫస్ట్ క్రష్ అతడే.. కాలేజీ రోజుల్లోనే అమ్మాడి వన్ సైడ్ లవ్ స్టోరీ..
Kajal
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కథానాయికగా పరిచయమై.. చందమామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో కాజల్ క్రేజ్ మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోస్ అందరితో జత కట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ రీఎంట్రీ ఇస్తుంది. లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసేందుకు సైతం రెడీ అయ్యింది. అయితే తాజాగా కాజల్ కు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాలేజీ రోజుల్లోనే కాజల్ వన్ సైడ్ లవ్ స్టోరీ ఉందట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కాజల్ తన ఫస్ట్ క్రష్ పేరును రివీల్ చేసింది. కాలేజీలో అక్షయ్ అనే వ్యక్తి తన ఫస్ట్ క్రష్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. క్రికెట్ అంటే తనకు ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని.. రోహిత్ శర్మకు తాను వీరాభిమానని చెప్పుకొచ్చింది. అతనిపై క్రష్ ఉందని వెల్లడించింది. ఇక ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

పెళ్లి తర్వాత చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఈ ఏడాది భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించగా..శ్రీలీల కీలకపాత్ర పోషించింది. అలాగే కొన్నిరోజుల క్రితం లేడీ ఓరియెంటెడ్ సిరీస్, మూవీస్ ద్వారా సందడి చేస్తుంది కాజల్. అలాగే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకుంది కాజల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.